Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, July 24: దేశంలో క్రితం రోజు 35వేలకు దిగొచ్చిన కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.31లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 39,097 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (COVID-19 in India) అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు ( COVID-19 Cases) దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 35,087 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు మొత్తం 3.05కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.35శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 546 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,20,016 మంది మృత్యువాత పడ్డారు. ఇక కొత్త కేసులు అధికమవడంతో యాక్టివ్‌ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,977 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31శాతానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కాస్త పుంజుకున్నట్లే కన్పిస్తోంది. శుక్రవారం 42.67లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 42.78కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశారు.

మళ్లీ ఇంకో కొత్త వైరస్, యూకేని వణికిస్తున్న నోరో వైరస్‌, ఐదు వారాల్లోనే 154 కేసులు నమోదు, నోరో వైరస్‌ లక్షణాలు ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, నోరోవైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి

కేరళలో గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,518 కరోనా కేసులు, 132 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,35,533కు, మొత్తం మరణాల సంఖ్య 15,871కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 11,067 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,83,962కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,35,198 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

దయచేసి అందరూ వ్యాక్సిన్ వేసుకోండి, నేను కరోనాతో 10 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయా, కోవిడ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే సాక్ష్యమని తెలిపిన అమెరికన్‌ సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి

దేశంలో క‌రోనా వైర‌స్‌ థ‌ర్డ్ వేవ్ త‌ప్ప‌ద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్య‌లు చేశారు. దేశ జ‌నాభాలో అత్య‌ధికుల‌కు మెరుగైన రీతిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉంద‌ని సెరోస‌ర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. వైర‌స్ స్వ‌భావం ఎలా మారుతుంద‌నేది మ‌నం అంచ‌నా వేయ‌లేమ‌ని..అయితే రాబోయే నెల‌ల్లో అది అనూహ్యంగా ప‌రివ‌ర్త‌న చెందేలా క‌నిపించ‌డం లేద‌ని అన్నారు. సెరో స‌ర్వే ప్ర‌కారం దేశ జ‌నాభాలో ఎక్కువ మందికి రోగ‌నిరోధ‌కత ప్ర‌బ‌లంగా ఉంద‌ని వెల్ల‌డైంద‌ని చెప్పారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు విధిగా కొవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని డాక్ట‌ర్ గులేరియా విజ్ఞ‌ప్తి చేశారు.

కరోనా ప్రమాదంలో 40 కోట్ల మంది ప్రజలు, జూన్‌–జూలైల్లో చేపట్టిన నాలుగో సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

దేశ జ‌నాభాలో అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లకు వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వ‌ర‌కూ రాబోయే నెల‌ల్లో మ‌నం జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్రాంతాల్లోకి వెళ్ల‌కుండా, ప్ర‌మాణాల‌కు దూరంగా ఉండ‌టం వంటి నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే మ‌నం థ‌ర్డ్ వేవ్ త‌లెత్త‌కుండా జాప్యం చేయ‌డంతో పాటు థ‌ర్డ్ వేవ్ వ‌స్తే దాన్ని తీవ్ర‌త‌రం కాకుండా ప‌రిమితం చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన తాజా సెరో స‌ర్వేలో ఆరేండ్లు పైబ‌డిన జ‌నాభాలో 67.6 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు త‌యార‌య్యాయ‌ని వెల్ల‌డైంది.