Norovirus: మళ్లీ ఇంకో కొత్త వైరస్, యూకేని వణికిస్తున్న నోరో వైరస్‌, ఐదు వారాల్లోనే 154 కేసులు నమోదు, నోరో వైరస్‌ లక్షణాలు ఏంటి, అది ఎలా వ్యాప్తిస్తుంది, నోరోవైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి
Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

London, July 20: కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ (Norovirus outbreak in UK) కలకలం రేపుతోంది.ఇంగ్లండ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ‍ప్రభుత్వం ఆంక్షలు సడలించగా కొత్తగా నోరో వైరస్‌ (Norovirus) వెలుగులోకి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే గణనీయంగా దీని బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరిగినట్లు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్‌ఇ) తెలిపింది. గత ఐదు వారాల్లో 154 మంది నోరో వైరస్‌ బారిన పడటంతో దీనిపై ప్రజలకు అప్రమత్తత అవసరమని హెచ్చరికలు జారీ చేసింది. ఇది వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉందని అక్కడి వైద్యాధికారులు తెలిపారు.

నోరో వైరస్‌ ప్రధాన లక్షణాలుగా.. కడుపు నొప్పి, డయేరియా, వాంతులు, జ్వర, పొట్ట, పేగుల్లో తీవ్రమైన మంట (acute gastroenteritis), విరేచనాలు (diarrhoea) ఉంటాయని, ముఖ్యంగా కడుపుపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మరింత ఆందోళన కలిగించే అంశమేమంటే, ముఖ్యంగా నర్సరీ, ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు పీహెచ్‌ఈ తెలిపింది. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. ఈ సమయంలో... వ్యాధి సోకిన వారు ముట్టుకునే వస్తువులు, ప్రదేశాల నుంచి ఈ వైరస్... ఇతరులకు వ్యాపించగలదు.

పెరుగుతున్న పెగాసస్ బాధితులు, దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్, రాహుల్ గాంధీ, ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు వందల కొద్ది నేతల ఫోన్లు ట్యాపింగ్, అసలు పెగాసస్‌ స్పైవేర్ అంటే ఏంటి

ప్రధానంగా విద్యాసంస్థలు... ముఖ్యంగా నర్సరీలు, చైల్డ్ కేర్ సెంటర్లలో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతున్నాయి. సీడీసీ ప్రకారం.. ఈ వైరస్‌ సంక్రమణ..వైరస్‌ సోకిన వ్యక్తి ద్వారా, కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు రెండు, మూడు రోజులు ఉంటాయని పేర్కొంది. ప్రత్యేకంగా దీనికంటూ ఎటువంటి మందు లేదని అంటున్నారు. వాంతులు, విరోచనాలు వల్ల మన శరీరం కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేయడానికి పుష్కలంగా ద్రవాలను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోరో వైరస్‌ని స్టమక్ ఫ్లు (Stomach flu) లేదా స్టమక్ బక్ (Stomach bug) అని కూడా అంటారు. ఇది ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ద్వారా వచ్చే జ్వరం లాంటిది కాదు అని అమెరికా వ్యాధుల నియంత్రణ సంస్థ (CDC) తెలిపింది. కొంతమందికి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారికి 12 గంటల నుంచి 48 గంటల్లో లక్షణాలు బయటపడతాయి. చాలా మంది ఒకటి నుంచి 3 రోజుల్లో వ్యాధి నుంచి కోలుకుంటారు. తినే ఆహారం, తాగే నీరు ద్వారా నోరో వైరస్ మనుషులకు సోకగలదు. ఆల్రెడీ వైరస్ ఉన్నవారు ముట్టుకున్న వస్తువులు, ప్రదేశాలను టచ్ చేసిన వారు... తెలియకుండా ఆ చేతుల్ని నోట్లో పెట్టుకుంటే... వారికి ఈ వైరస్ సోకగలదు. అందుకే పిల్లలకు ఎక్కువగా సోకుతోంది.

డేంజర్ బెల్స్..కరోనా థర్డ్ వేవ్‌ని తీసుకువస్తున్న డెల్టా వేరియంట్, భారత్‌కు త్వరలో 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్లు, దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు నమోదు, ఇప్పటి వరకూ 40.64 కోట్ల మందికి టీకా పంపిణీ

ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. శుభ్రమైన నీరు వాడాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. పిల్లలకు డైపర్లు తరచుగా మార్చేస్తూ ఉండాలి. పరిశుభ్రతే ఈ వైరస్‌ నుంచి మనల్ని కాపాడుతుంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా... ఇది కలిగించే బాధ, నొప్పి, మంట చాలా తీవ్రంగా ఉంటాయనీ, ఇతరులకు వేగంగా సోకుతుందనీ... అందువల్ల జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.