Weather Forecast: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగు­తున్న అల్ప­పీడనం, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం

అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Andhra Pradesh Rains: Heavy Rains in These Districts Over Low Pressure

Vjy, Dec 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని .

మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)

సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ సోమవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌ సగటున 14.10 డిగ్రీల సెల్సియస్‌తో గతేడాది నవంబర్‌ తర్వాత రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం కాలం నాటి ముందు స్థాయిల కంటే ఈ ఏడాది నవంబర్‌లో 1.62 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని చెప్పింది.

భారత వాతావరణ విభాగం ప్రకారం నవంబర్‌ నెల ఉష్ణోగ్రత రికార్డులు పరిశీలిస్తే 1901 తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.62 డిగ్రీలు అధికంగా సగటున గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.37 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు దాదాపుగా 0.72 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిలిచాయని, 1991-2020 సగటుతో పోలిస్తే ఇది అధికమని కోపర్నికస్‌ తెలిపింది.