Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.
Vijayawada, Dec 10: ఏపీలోని (AP) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త ప్రమాదం నుంచి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు. పోతవరానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ భార్య ఉమ, కుమారులు రోహిత్, మనోజ్ తో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వేకువజామున ఈ ప్రమాదం జరిగింది.
Here's Video:
కోనసీమ జిల్లాలో విషాదం.
నేలపూడి విజయ్ తన ఫ్యామిలీతో కలిసి కారులో వైజాగ్ నుంచి పి.గన్నవరం మండలం పోతవరం వెళ్తుండగా పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో విజయ్ భార్య, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. విజయ్ క్షేమంగా బయటపడ్డారు. #caraccident pic.twitter.com/g6KgHXH1vY
— greatandhra (@greatandhranews) December 10, 2024
డ్రైవ్ చేసింది ఎవరంటే?
ఘటన జరిగిన సమయంలో ఉమ కారు డైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రమాదం జరగ్గానే స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
(The above story first appeared on LatestLY on Dec 10, 2024 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

