World's 1st Coronavirus Vaccine: కరోనావైరస్‌ని చంపే తొలి వ్యాక్సిన్ రెడీ, రష్యాలో అన్ని క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న కోవిడ్–19 వ్యాక్సిన్, త్వరలో మార్కెట్లోకి..
ఇందులో భాగంగానే ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్–19 వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం ప్రపంచానికి ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. రష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగం (World's 1st Coronavirus Vaccine) కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ వెల్లడించారు.
Moscow, July 12: కోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై (COVID-19 Vaccine) జరుగుతున్న ప్రయోగాలు జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్–19 వ్యాక్సిన్ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం ప్రపంచానికి ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. భారీగా కోలుకున్న కరోనా బాధితులు, దేశంలో ఇప్పుడు కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,01,609 మాత్రమే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 8,78,254
రష్యాలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగం (World's 1st Coronavirus Vaccine) కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ వెల్లడించారు. గమలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయోలజీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను జూన్ 18 నుంచి ప్రారంభించింది.
వ్యాక్సిన్‌ను పరీక్షించిన వాలంటీర్లలో మొదటి బృందాన్ని బుధవారం డిశ్చార్జ్ చేస్తారు. రెండో బృందం వాలంటీర్లను జూలై 20న డిశ్చార్జ్ చేయనున్నట్టుగా తారాసోవ్ తెలిపారు. టీకా భద్రత పరీక్షలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషేవ్ వెల్లడించారు. వ్యాక్సిన్ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక వ్యాక్సిన్ అభివృద్ధిపై సెచెనోవ్ యూనివర్సిటీ దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది.
కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లండన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది. ఆ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం అందరిలోనూ ఆశలు నింపుతోంది.