![](https://test1.latestly.com/uploads/images/2025/02/68-108.jpg?width=380&height=214)
Cuttack, FEB 09: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో 305 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా అక్షర్ పటేల్(41 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (44) లు రాణించారు. విరాట్ కోహ్లీ (5) విఫలం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్ స్టోన్, గుస్ అట్కిన్సన్ తలా ఓ వికెట్ సాధించారు.
భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం ఇచ్చారు. చాలా కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తరువాత కూడా అదే దూకుడును కొనసాగించాడు.
IND Win By Four Wickets
2ND ODI. India Won by 4 Wicket(s) https://t.co/NReW1eEQtF #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 9, 2025
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బ్యాటర్‌లలో ఓపెనర్ బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసి లక్ష్యం మరింత పెరగకుండా కట్టడి చేశాడు. దాంతో 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. మరో ముగ్గురు బ్యాటర్‌లు రనౌట్ అయ్యారు.