Ram Lalla Idol Shifting: అయోధ్యలో కీలక ఘట్టం, రామ జన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం, 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్ర నవరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున పూజల అనంతరం రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి (Ram Lalla Idol Shifting) తరలించారు.
Ayodhya, March 25: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి (Ayodhya Ram Temple construction) సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar pradesh Govt) శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
చైత్ర నవరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున పూజల అనంతరం రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి (Ram Lalla Idol Shifting) తరలించారు.
రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు
యోగీ ఆదిత్యనాథ్ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు. రామమందిరం నిర్మాణం చేపట్టడం కోసం రాముని విగ్రహాన్ని తాత్కాలిక ఆలయంలోకి తరలించారు.
అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం
అయోధ్యలో రామాలయం నిర్మించేవరకూ రామజన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్‌లోకి రామ్‌లల్లా విగ్రహం పూజలు అందుకోనుంది. నవరాత్రి మొదటిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయం నిర్మాణం కోసం రూ.11లక్షల చెక్ ను ప్రదానం చేశారు.
Yogi Adityanath's Tweet:
తాత్కాలిక నిర్మాణంలో 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో సభ్యునిగా ఉన్న రాజ అయోధ్య విమలేంద్ర మోహన్ మిశ్రా ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చారు. జైపూర్‌కు చెందిన కళాకారులు దీనిని తయారుచేశారు. రామమందిరం నిర్మాణం పూర్తయ్యే వరకు రాముడి విగ్రహం తాత్కాలిక నిర్మాణంలోనే ఉంచనున్నారు.
Here Are Some Reactions to Yogi Adityanath's Temple Run During Lockdown Over Coronavirus:
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎంతోపాటు అయోధ్య జిల్లా అధికారులతో పాట, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేసే తేదీని ఏప్రిల్ 2వతేదీ రామనవమి సందర్భంగా ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గతంలో ప్రకటించింది.
అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు
బుధవారం ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ రామాలయం నిర్మాణంపై సాంకేతిక నివేదికను సమర్పించనుంది. రామ్ లల్లా విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూసి ఆయన ఆశీర్వాదం పొందవచ్చని విశ్వహిందూ పరిషత్ నాయకుడు వినోద్ కుమార్ బన్సాల్ చెప్పారు.
అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది ?
అయితే ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆదిత్యనాథ్.. ఈ విధంగా పూజ కార్యక్రమంలో పాల్గొనడంపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.