Chandrababu Swearing in Ceremony: ఏపీ సీఎంగా చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత.. వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధం

ఉదయం 11.27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సాక్షిగా సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం చేయనున్నారు.

Chandrababu

Vijayawada, June 12: ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రిగా (CM) టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Swearing-in Ceremony) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సాక్షిగా సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఇరవై ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వేదికపై 60 మంది కూర్చనేలా ఏర్పాట్లు చేశారు.

నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. 16 జిల్లాలను కుదిపేయనున్న వానలు.. ఉత్తరాది జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్.. మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. హైదరాబాద్ లో మరో మూడు రోజులు వానలే.. వాతావరణ శాఖ ప్రకటన

మోదీ కోసం గ్రీన్ రూమ్

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజయ్యే ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూములను సిద్ధం చేశారు. ప్రధాని మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో ఒక గ్రీన్‌ రూమ్‌‌ ను ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, భారీగా ట్రాపిక్ జాం, వీడియోలు ఇవిగో..