BJP MP Bizarre Statements: గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి లేదంటే ఐయోడెక్స్ తినండి.. బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు.. నీటి పరిరక్షణపై మాట్లాడుతూ ప్రజలకు వింత పిలుపు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండడం ఆయనకు పరిపాటే.. గతంలో ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ

మద్యం తాగాలని, గుట్కా నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Credits: Livemint

Bhopal, Nov 8: మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) రేవా (Rewa) బీజేపీ ఎంపీ (BJP MP) జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం (Liquor) తాగాలని, గుట్కా (Gutka) నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, కాబట్టి వాటిని రక్షించాలని పేర్కొన్న ఆయన.. ‘‘గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి. సులేసాన్ (ఒక రకమైన జిగురులాంటి పదార్థం) లేదంటే ఐయోడెక్స్ తినండి. కానీ, నీళ్ల ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నేడే చంద్ర గ్రహణం.. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం

రేవాలోని కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏదైనా ప్రభుత్వం నీటి పన్నులు మాఫీ చేస్తామని చెబితే నీటి పన్నులను తాము చెల్లిస్తామని, కరెంటు బిల్లులు సహా ఇతర పన్నులను మాఫీ చెయ్యాలని కోరాలని జనార్దన్ మిశ్రా ప్రజలను కోరారు. మిశ్రా వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండడం ఆయనకు పరిపాటే. ఇటీవల ఆయన ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన వీడియో వైరల్ అయింది.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..