IPL Auction 2025 Live

Sushil Kumar Modi No More: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత‌.. గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్న సుశీల్.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన‌ ప్ర‌ధాని మోదీ

ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో సోమవారం రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Sushil Kumar Modi (Credits: X)

Patna, May 14: బీహార్ (Bihar) మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ (72) (Sushil Kumar Modi) క‌న్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో సోమవారం రాత్రి 9.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన గ‌త కొంత‌కాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింద‌ని, ఈసారి లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన‌లేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీవాసుల ఓటు చైతన్యం.. అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్ నమోదు.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్.. 63.19 శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి తక్కువగా పోలింగ్ నమోదు.. ఈసీ అధికారిక గణాంకాలు విడుదల

ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

సుశీల్ కుమార్ మోదీ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న అకాల మరణం త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌ని ట్వీట్ చేశారు.

ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు