TDP-Janasena-BJP Alliance: పల్నాడులో నేడు టీడీపీ-జనసేన-బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి ముగ్గురు నేతలు

లోక్ సభ, ఏపీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు.

TDP-JanaSena-BJP Alliance (Credits: X)

Vijayawada, Mar 17: లోక్ సభ (Loksabha), ఏపీ అసెంబ్లీకి (AP Assembly) ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నేడు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. దాదాపు పదేళ్ల తరువాత కూటమి భాగస్వాములు అందరూ ఒక్క వేదికపై రానుండటంతో ఈ సభకు ప్రాధాన్యం పెరిగింది.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అటు ఏపీలోనూ వర్షాలు

సీట్ల పంపకంపై ఒప్పందం

ఇటీవల బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్రంలో ఆరు లోక్‌ సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ 17 లోక్‌సభ స్థానాల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలుస్తుంది. ఇక జనసేన 2 లోక్‌ సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Kavitha Sent For 7 days ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు