Representational Image (Photo Credits: Twitter)

Hyderabad, Mar 17: ఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ-IMD) చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Rains in Telugu States) కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణలో (Telangana) రానున్న నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నాడు సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా వానలు పడతాయని పేర్కొంది.

Kavitha Sent For 7 days ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు

ఏపీలోనూ..

రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు బుధవారం వర్ష సూచన ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు హెచ్చరించింది. అటు ఏపీలోనూ వానలు పడనున్నట్టు వివరించింది.

HC on Wife Racial Remarks on Husband: భర్త న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించ‌డం క్రూర‌త్వ‌మే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు