CAA Row-Pinarayi Vijayan: సీఏఏని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం, సీఏఏను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున మానవహారం, రిపబ్లిక్ డే వేళ కేంద్రంపై మండిపడిన కేరళ సీఎం పినరయి విజయన్
రిపబ్లిక్ డే (Republic Day 2020) వేళ కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రం అమలు చేయాలని చూస్తున్న పౌరసత్వసవరణ చట్టంను (Citizenship Amendment Act) ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు.
Thiruvananthapuram, January 26: రిపబ్లిక్ డే (Republic Day 2020) వేళ కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రం అమలు చేయాలని చూస్తున్న పౌరసత్వసవరణ చట్టంను (Citizenship Amendment Act) ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) అన్నారు.
కేరళ రా ష్ట్రంలో దీన్ని అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మానవహారం నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. సీఏఏ (CAA) అనేది మత సంఘర్షణలకు దారి తీసే దుశ్చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఏఏపై సుప్రీంకోర్టు గడప తొక్కిన తొలి రాష్ట్రంగా గుర్తింపుకెక్కిన కేరళ
భారతదేశం లౌకికవాదానికి ప్రతీక. అలాంటి, లౌకివతత్వానికి భంగం కలిగిస్తామంటే ఎలా ఊరుకుంటామని కేరళ సీఎం (Kerala CM) కేంద్రంపై మండిపడ్డారు. కేరళలో ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఆర్‌పీని అమలుకానివ్వమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సీఏఏ సెక్యూలరిజానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, దీనిని తమ రాష్ట్రంలో అడుగు పెట్టనీవబోమని, అమలు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు.
Here's the ANI tweet:
ఇదిలా ఉంటే ఇప్పటికే కేరళ అసెంబ్లీ (Kerala Assembly) సీఏఏను వ్యతిరేకిస్తున్నట్లు బిల్ పాస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించేందుకు కలిసి రావాలని 11 మంది ముఖ్యమంత్రులకు సీఎం పినరయి విజయన్ లేఖలు రాశారు.
స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు
తాజాగా 2020, జనవరి 26వ తేదీ ఆదివారం భారీ మానవహారం (Anti-CAA Human Chain) చేపట్టింది. దాదాపు ఏడు మిలియన్ల మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. సీఎం పినరయి విజయన్ కూడా పాల్గొని తమ నిరసనను తెలియచెప్పారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Here's 620 km long human chain in Kerala
620 కి.మీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడ్డారు. నార్త్ కేరళలోని కసర్ గోడ్ నుంచి ప్రారంభమైంది. దక్షిణభాగంలోని కలియక్కవిలై వరకు దీనిని నిర్వహించారు. సాయంత్రం 4గంటలకు మానవహారం ఏర్పాటైంది. అనంతరం రాజ్యాంగంపై ప్రమాణం చేశారు.
కేరళ తర్వాత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన పంజాబ్ రాష్ట్రం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు.. అనుకూలంగా బీజేపీ పోటాపోటీ ప్రదర్శనలు చేపడుతున్నాయి. సీఏఏ చట్ట వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్
దేశ పౌరుల హక్కులను కాలరాస్తుందని, మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని అంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ తెలంగాణా రాష్ట్రాలు సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
CAAకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంకా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. CAA, NRC, NPRలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. వీటిని అమలు చేయమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. వెంటనే వీటిని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది .