CAA against Right to Equality: Kerala govt moves Supreme Court, first state to do so (Photo-PTI)

Thiruvananthapuram, January 14: పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని కేరళ ప్రభుత్వం(Kerala Govt) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఏఏకి(Citizenship Act) వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ (Pinarayi Vijayan) అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు విరుద్ధమంటూ విజయన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పలు రాష్ట్రాలు సీఏఏపై వ్యతిరేకతను వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకెళ్లిన మొదటి రాష్ట్ర ప్రభుత్వం కేరళ కావడం విశేషం.

సీఏఏ,పాస్ పోర్ట్ చట్టం,ఫారినర్స్ యాక్ట్ రూల్స్ ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంలో(Supreme Court) పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25 భారతదేశంలోని లౌకికవాదం యొక్క ప్రాథమిక నిర్మాణం ఉల్లంఘనగా సీఏఏని ప్రకటించాలని కేరళ సర్కర్ తన పిటిషన్ లో తెలిపింది. అలాగే దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసే విధంగా చట్టం ఉందంటూ పేర్కొంది. ఈ మేరకు సీఏఏ చట్టాన్ని సవాలు చేస్తూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది.

స్వార్థపరుల ఆటలు ఇక సాగవు, ఆవదంతులు నమ్మవద్దు, సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు

అంతకుముందు 11మంది బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు కేరళ సీఎం విజయన్ సీఏఏ విషయమై లేఖలు కూడా రాశారు. ప్రజాస్వామ్యం,సెక్యూలరిజాన్ని రక్షించడం కోసం కలిసికట్టుగా ఆ రాష్ట్రాల సీఎంలు కూడా తమ తమ అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేయాలని ఆ లేఖల్లో విజయన్ తెలిపారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ఇప్పటికే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. వివాదాస్పద చట్టాలు చెల్లుబాటు కావుంటూ.. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఇదివరకే సుప్రీం విచారణకు స్వీకరించింది.

నిరసనల పేరుతో విధ్వంసం సృష్టించిన 'హింసాత్మక ఆందోళనకారుల' ఫోటోలను విడుదల

ఈ నేపథ్యంలోనే కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు. అలాగే బీజేపీయేతర ముఖ్యమంత్రులకూ విజయన్‌ లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. అలాగే అసెం‍బ్లీలో ప్రత్యేక తీర్మానం కూడా చేయాలని సూచించారు.