Differently Abled Kerala Artist Wins Pinarayi Vijayan's Heart After Donating to Relief Fund (Photo-Facebook)

Alathur, Novemebr 12: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ స్టోరీనే నిదర్శనం, శరీరంలో అన్నీఅవయువాలు సక్రమంగా ఉండి సోమరిపోతుల్లా తిరుగుతున్న యువకులకు ఈ కథనే ఓ గుణపాఠం. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన యువకుడు చూపించిన ఆత్మస్థయిర్యానికి కేరళ సీఎం (Kerala CM Pinarayi Vijayan) సైతం ఫిదా అయ్యారు. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని అతని ట్విట్టర్లో కేరళ సీఎం పొగడ్తలు (Pranav Wins CM Pinarayi Heart) కురిపించారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తో కాలితో సెల్పీ దిగుతున్న ఈ ఈ దివ్యాంగ యువకుడి పేరు ప్రణవ్‌ బాలసుబ్రహ్మణ్యన్(artist Pranav Balasubrahmanyan). వయసు 22 ఏళ్లు. ఈ యువకుడికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు(Differently Abled Kerala Artist). అయితేనేమి తన వైకల్యానికి కుంగిపోకుండా దృఢచిత్తంతో చిత్రకారుడిగా రాణిస్తున్నాడు.

కాళ్లతోనే అత్యద్భుత చిత్రాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఎవరి మీదా ఆదారపడకుండా సొంతంగా ఆర్టికంగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వైకల్యం తన దేహానికే కాని మనసుకు లేదని తాజాగా మరోసారి నిరూపించాడు.

ప్రణవ్ మీద పొగడ్తల వర్షం కురిపించిన కేరళ సీఎం 

తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. చిన్న వయసులోనే ప్రణవ్‌ చూపిన ఔదార్యానికి ముగ్దులైన సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) అతడి గురించి తన ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు.

‘‘ఈరోజు లెజిస్లేటివ్‌ కార్యాలయానికి రాగానే కలకాలం గుర్తుండిపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అలాచూర్‌ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు ప్రణవ్‌ తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన వంతు సాయం అందించేందుకు నా దగ్గరకు వచ్చాడు. టీవీ రియాలిటీ షోలో సంపాదించిన మొత్తాన్ని చెక్‌ రూపంలో అతడు విరాళంగా ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడికి రెండు చేతులూ లేవు. ప్రణవ్‌కు రెండు చేతులుగా నిలిచిన అతడి తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్‌‌, స్వర్ణకుమారితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేడీ ప్రసన్న కూడా తన వెంట వచ్చారు.

క్రికెట్ లెజెండ్ సచిన్ మనసును గెలుచుకున్న కేరళ కుర్రాడు ప్రణవ్ 

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం తనకు వంద శాతం ఉందని నాతో ప్రణవ్‌ చెప్పాడు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది. పలక్కాడ్‌ జిల్లాలోని చిత్తూర్‌ ప్రభుత్వ కాలేజీ నుంచి బీకామ్‌ పూర్తిచేసిన ప్రణవ్‌ ఉన్నత చదువుల కోసం కోచింగ్‌ తీసుకుంటున్నట్టు తెలిపాడు. నాతో చాలా సేపు మాట్లాడాడు. కాలితో సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశాడ’ని విజయన్‌ పేర్కొన్నారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రణవ్‌పై సహృదయానికి సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

అయితే ఇది మొదటిసారే కాదు. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రణవ్ విరాళం ఇచ్చాడు. అలాగే గతేడాది వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తన పెయింటింగ్స్‌ అమ్మగా వచ్చిన మొత్తాన్నికూడా సహాయంగా అందించాడు.

ఓనమ్‌ పండుగ సందర్భంగా ప్రణవ్‌ గురించి దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin) ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడి ప్రతిభ, పట్టుదల తనకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయని ట్విటర్‌ (Twitter) ద్వారా ప్రశంసించాడు. ప్రణవ్‌ కాలితో గీసిన ఫొటోను తనకు ఇస్తున్న ఫొటోలను సచిన్‌ షేర్‌ చేశాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రణవ్‌ తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కుడి కాలి రెండో వేలుతో ఈవీఎం మీట నొక్కి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.