Madhya Pradesh Crisis: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా, కమల్ నాథ్ సర్కార్ పరిస్థితేంటి, బీజేపీ తదుపరి వ్యూహాం ఏంటీ ?

కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆ లేఖలో సింధియా పేర్కొన్నారు.

Jyotiraditya Scindia. (Photo Credit: PTI)

Bhopal, March 10: మధ్యప్రదేశ్‌ రాజకీయం (Madhya Pradesh Crisis)మంగళవారం కొత్తమలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆ లేఖలో సింధియా పేర్కొన్నారు.

సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్

రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరిక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సోనియాగాంధీకి పంపిన లేఖలో సింధియా పేర్కొన్నారు.

Here's his tweet:

ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియాను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. సింధియా సోమవారంనాడు ఢిల్లీకి చేరుకోవడం, ఆయనకు మద్దతుదారులైన 20 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు తరలిపోవడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సర్కార్ పతనం అంచుల్లోకి చేరింది.

అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం  కమల్‌ నాథ్

ఈ నేపథ్యంలో సింధియాను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను మంగళవారంనాడు హుటాహుటిన రంగంలోకి దింపింది. తొందరపడి పార్టీని వీడవద్దని సింధియాకు పైలట్ సందేశం పంపినప్పటికీ, దానికి సింధియా స్పందించలేదని అంటున్నారు.

కాగా 17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని (PM Narendra Modi) కలిశారు.ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధానిని కలిశారు. దీంతో సింధియా బీజేపీలో చేరిక దాదాపు ఖాయమైంది. సింధియాకు రాజ్యసభ సీటుతో పాటు, మోదీ క్యాబినెట్‌లో మంత్రి పదవి కూడా బీజేపీ ఇవ్వనుందని అనధికార వర్గాల సమాచారం. దీనికి ముందు, కమల్‌నాథ్ సైతం సింధియాకు పీసీసీ పదవితో పాటు, రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని ప్రకటించారు.



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం