Shiv Sena MLA Sanjay Gaikwad: వైరస్ దొరికితే నేరుగా బీజేపీ నేత ఫడ్నవీస్ నోట్లో వేస్తాను, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, మహారాష్ట్రలో ముదురుతున్న కరోనా రాజకీయాలు
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తనకు కరోనా వైరస్ గనుక దొరికితే దానిని నేరుగా ఫడ్నవీస్ నోటిలో వేస్తానని అన్నారు.
Mumbai, April 18: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో శివసేన ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా దాడిచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తారా అంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ (Shiv Sena MLA Sanjay Gaikwad) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై (Devendra Fadnavis) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు కరోనా వైరస్ దొరికితే దానిని నేరుగా ఫడ్నవీస్ నోటిలో వేస్తానంటూ సంజయ్ గైక్వాడ్ పేర్కొన్నారు.
రాజకీయాలు చేయడానికి ఇది సమయమా..? అంటూ ఆయన ఫడ్నవీస్‌ను ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలంటూ గైక్వాడ్ ఘాటుగా విమర్శించారు. ఉద్ధవ్ థాకరేతో సహా మంత్రి వర్గం మొత్తం కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ పేర్కొన్నారు.
కాగా ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేస్తే.. స్పందించలేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఉద్ధవ్ కావాలనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ కేంద్రమంత్రులు హర్షవర్ధన్, పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ తో మాట్లాడేందుకు ప్రధాని ప్రయత్నించినా.. ఆయనే తిరస్కరించారని పేర్కొన్నారు.
Here's Shiv Sena MLA Sanjay Gaikwad Video
మహారాష్ట్రకు చాలినంత ఆక్సిజన్ ను సరఫరా చేస్తామంటూ ఉద్ధవ్ కు ప్రధాని హామీ ఇచ్చారని.. కానీ ఆయనే నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ హర్షవర్ధన్, గోయల్ పేర్కొన్నారు. కాగా కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 37,70,707కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 56,783 మంది కరోనా నుంచి కోలుకున్నారు