Ponnam Meets KCR: నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??
మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు.
Hyderabad, Dec 7: తెలంగాణలో (Telangana) నేడు రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. మాజీ సీఎం కేసీఆర్ (CM KCR) ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కలవనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ఆయన్ని ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ సీఎంఓ కేసీఆర్ అపాయింట్ మెంట్ ను కోరింది. ఆయన కూడా సమ్మతించారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం కేసీఆర్ ను కలవనున్నారు.
కేసీఆర్ హాజరుపై సస్పెన్స్
డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తెలంగాణ తల్లి గత విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని తీసుకురావడం, విగ్రహం రూపురేఖలు మార్చడంపై బీఆర్ఎస్ నిరసనలు చేపడుతుంది. ఈ క్రమంలో పొన్నం ఆహ్వానం మేరకు కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా? అనేది సస్పెన్స్ గా మారింది.