IPL Auction 2025 Live

Bihar Political Crisis Row: 160 మంది ఎమ్మెల్యేల మద్దతు, బీహార్ సీఎంగా రేపు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌, ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు

బీహార్‌ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.మంగళవారం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) బీహార్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

Nitish Kumar To Continue As Bihar CM, Tejaswi Yadav As Deputy CM and Speaker

Patna, August 9: బీహార్‌ పాలిటిక్స్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.మంగళవారం నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) బీహార్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఇక ఆర్జేడీతో కలిసి నితీష్‌ కుమార్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్‌ కుమారే (Nitish Kumar To Continue As Bihar CM) ఉండనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు డిప్యూటీ సీఎం (Tejaswi Yadav As Deputy CM and Speaker) ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.కాగా బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి నితీష్ కుమార్ రాజీనామా, ఆర్జేడీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం, బీహార్‌లో ముగిసిన బీజేపీ-జేడీయూ కూటమి పాలన

రాజీనామా అనంతరం నితీష్‌ కుమార్‌ మీడియాతో​ మాట్లాడుతూ.. సీఎం పదవికి రాజీనామా చేశాను. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాము. జేడీయూను విడదీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెలిపారు. నితీష్‌ కుమార్‌ రాజీనామా చేసిన అనంతరం.. పాట్నాలోని రాబ్రీ దేవి ఇంటికి వెళ్లారు. ఈ ‍క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

మంగ‌ళ‌వారం ర‌బ్రీదేవి నివాసంలో జ‌రిగిన స‌మావేశంలో ఆర్జేడీ-కాంగ్రెస్‌- లెఫ్ట్ పార్టీల‌తో కూడిన మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మి నేత‌గా నితీశ్ కుమార్ ఎన్నిక‌య్యారు. అటుపై ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌తో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్నారు.ఇప్ప‌టికే పాట్నాలోని ర‌బ్రీదేవి నివాసంలో జ‌రిగిన మ‌హాఘ‌ట్‌బంధ‌న్ స‌మావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామ‌ప‌క్షాల ఎమ్మెల్యేలు నితీశ్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ రాసిన లేఖ‌పై సంత‌కాలు చేశారు. మొత్తం 160 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేఖ‌ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు నితీశ్‌కుమార్ అంద‌జేశారు.

బీహార్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్ధం కావాలంటూ ట్వీట్ చేసిన లాలూ కూతురు రోహిణి యాదవ్

ఇదిలా ఉంటే బీహార్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.నితీశ్‌కుమార్‌కు ద‌మ్ముంటే తాజాగా ప్ర‌జాతీర్పు కోరాల‌ని అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నితీశ్ కుమార్ బ‌లం 43 స్థానాల‌కు ప‌డిపోయింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీరో అవుతుంద‌ని ఎద్దేవా చేశారు. రెండోసారి బీహారీ ప్ర‌జ‌ల తీర్పును నితీశ్ కుమార్ అవ‌మానిస్తున్నార‌ని ఆరోపించారు. కాగా 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూను బ‌ల‌హీన ప‌రిచేందుకు బీజేపీతో క‌లిసి చిరాగ్ పాశ్వాన్ కుట్ర చేశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.



సంబంధిత వార్తలు

Car Falls From Under Construction Bridge: గూగుల్ మ్యాప్ ను న‌మ్మి ప్రాణాలు పోగొట్టుకున్న ముగ్గురు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీద నుంచి ప‌డిపోయిన కారు

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి