బీహార్ జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భ‌వ‌న్‌లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ)తో క‌లిసి నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందని సమాచారం.కాగా పార్టీ స‌భ్యులంద‌రి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేసిన‌ట్లు నితీష్ కుమార్ ప్ర‌క‌టించారు.

బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు. దీంతో బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)