Karnataka politics: తరువాత ముఖ్యమంత్రి ఎవరని నేను చెప్పను, నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు, మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశా, వచ్చే సీఎంకు 100 శాతం సహకారం అందిస్తానని బీఎస్ యడియూరప్ప వెల్లడి
రాజీనామా నిర్ణయం తన సొంత నిర్ణయమని (I did it on my own) బీఎస్ యడియూరప్ప తెలిపారు.
Bengaluru, July 26: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని (Nobody pressurised me to resign), మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. రాజీనామా అనేది తన సొంత నిర్ణయమని (I did it on my own) బీఎస్ యడియూరప్ప తెలిపారు. కాగా సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సోమవారంనాడు ఆయన ప్రకటించిన విషయం విదితమే. తద్వారా మరొకరు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమవుతుందని అన్నారు.
బీజేపీ రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఆయన (Outgoing Karnataka CM BS Yediyurappa) రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. 75 ఏళ్ల తర్వాత కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కర్ణాటక ప్రజలకు రుణపడి ఉంటా. గవర్నర్‌కు రాజీనామా ఇచ్చి ఆమోదించాలని కోరా. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తాం. నేను ఎవరి పేరును సిఫార్సు చేయలేదు. అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తా. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Here's ANI Tweet
అధిష్ఠానం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించినా తాము అతని నాయకత్వంలో పనిచేస్తామని బీఎస్ యెడియూరప్ప చెప్పారు. తాను నూటికి నూరు శాతం కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తానని, అదేవిధంగా తన మద్దతుదారులు కూడా వచ్చే సీఎంకు 100 శాతం సహకారం అందిస్తారని యెడ్డీ స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానము, అసంతృప్తి అక్కెర లేదని ఆయన అన్నారు.
కాగా, కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కర్ణాటక నూతన సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్ ఉన్నారు. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో.. కర్ణాటక నూతన సీఎం పేరు ఖరారు చేసే అవకాశం ఉంది.