Narendra Modi: యూపీలో నేడు ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. రెండు వందేభారత్ రైళ్లు, రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Prime Minister Narendra Modi. (Photo Credits: Twitter Video Grab)

Newdelhi, July 7: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నేడు ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) గోరఖ్‌పూర్‌తో(Gorakhpur)పాటు తన నియోజకవర్గమైన వారణాసిలో(Varanasi) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్ల (Vandebharat)తోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వజీద్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం ‘టిఫిన్ పే చర్చా’ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TANA Sabha: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా, శ్రీలీల కూడా..

పర్యటన ఇలా..

  • పర్యటనలో భాగంగా మోదీ తొలుత గోరఖ్‌పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
  • తర్వాత, గోరఖ్‌పూర్-లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.
  • జోధ్‌పూర్-సబర్మతి వందేభారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • ఆ తర్వాత.. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు.
  • ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్‌నగర్ మధ్య ఫ్రైట్ కారిడార్‌ను, వారణాసి-జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్‌చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు.
  • బనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

No Leave in 74 Years: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 74 ఏళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం.. 90 ఏళ్లకు రిటైర్మెంట్.. అమెరికా‌కు చెందిన మెల్బా మెబానే బామ్మ అరుదైన ఫీట్

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు

UCC In Uttarakhand: సహజీవనం దాస్తే జైలుకెళ్లాల్సిందే, ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ కోడ్, అసలేంటి ఈ ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీపై సమగ్ర కథనం ఇదిగో..

CM Revanth Reddy On UGC Rules: యూజీసీ నిబంధనలపై కేంద్ర కుట్ర.. ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేన్న సీఎం రేవంత్ రెడ్డి, మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేమని వెల్లడి

Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..

Share Now