CWC Meeting Highlights: మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు, సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఆగ్రహం,పెను ప్రకంపనలు రేపిన అధినాయకత్వ మార్పు లేఖ

నాయకత్వ మార్పు కో​రుతూ సీనియర్‌ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ పార్టీలో (Congress Working Committee) పెను ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించారు.

Rahul Gandhi | File Image | (Photo Credits: PTI)

New Delhi, August 24: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) భేటీ వేదికగా మరోసారి పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడ్డాయి. నాయకత్వ మార్పు కో​రుతూ సీనియర్‌ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ పార్టీలో (Congress Working Committee) పెను ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించారు.

రాహుల్‌ (Rahul Gandhi) వ్యాఖ్యలపై సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలున్నాయని రాహుల్‌ వ్యాఖ్యానించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం జీవితం అంకితం చేశామని, ఇన్లాళ్ల తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యలతో కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) , ఆజాద్‌ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్‌ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అధ్యక్ష మార్పు లేఖ ప్రకంపనలు, కొత్త అధినేతను ఎన్నుకోవాలని కోరిన సోనియా గాంధీ

ఇదిలా ఉంటే బీజేపీతో కుమ్మక్కయ్యారన్న రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ట్వీట్ చేసిన సీనియర్ నేత కపిల్ సిబల్ ఒక్క సారిగా ‘యూటర్న్’ తీసుకున్నారు. ‘‘ సమావేశంలో ఆ వ్యాఖ్యలు నేను చేయలేదని రాహుల్ గాంధీ నాకు వ్యక్తిగతం తెలిపారు. అందుకే నేను ఆ ట్వీట్‌ను ఉపసంహరించుకుంటున్నా.’’ ( Kapil Sibal Deletes His Tweet) అని కపిల్ సిబల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను నిలబెట్టింది ఎవరు?మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను కాపాడిందెవరు? గత 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అలాంటిది... మమ్మల్నే బీజేపీతో కుమ్మక్కయ్యారంటారా?’’ అంటూ ట్విట్టర్ వేదికగా సిబల్ ఏకిపారేశారు. కేరళ సీఎం పినరయిపై అవిశ్వాస తీర్మానం, చర్చకు ఆమోదం తెలిపిన స్పీకర్, అవిశ్వాసంపై చర్చించడానికి రెండు రోజులు సమయం కావాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్‌ సిబల్‌తో రాహుల్‌ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్‌ వెల్లడించారు.

మరోవైపు తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. అదే విధంగా.. పార్టీ అధినాయకత్వాన్ని తక్కువ చేసి చూపేలా లేఖ రాయడం సరికాదంటూ సహచరులపై అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.