Thiruvananthapuram, August 24: కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని(UDF Moves No-confidence Motion) ప్రవేశపెట్టింది. పీకల్లొతు అవినీతిలో కూరుకుపోయారన్న విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే వీడీ సతీషన్ (Congress legislator V D Satheeshan) పినరయి ప్రభుత్వంపై (Pinarayi Vijayan Govt) అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై చర్చించడానికి స్పీకర్ ఆమోదించారు. బంగారం స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో సీఎం పినరయ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
కరోనాపై చర్చించడానికి కేరళ అసెంబ్లీ సోమవారం ఒక్క రోజు సమావేశమైంది. అయితే అవిశ్వాసంపై చర్చించడానికి చివరి ఐదు గంటల సమయం కేటాయిస్తారని సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం సుమారు రెండు రోజుల పాటు అవిశ్వాసంపై చర్చించడానికి సమయం కావాలంటూ డిమాండ్ చేసింది.
కోవిడ్ 19 పేరుతో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని గతంలోనే విపక్ష నేత రమేష్ డిమాండ్ చేశారు ఇక, గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ పినరయి విజయన్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ రోజు కేరళ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలు స్పీకర్ సభకు అధ్యక్షత వహించవద్దని ప్రతిపక్ష నాయకుడు రమేష్ డిమాండ్ చేశారు.
ఎందుకంటే స్పీకర్ (Speaker P Sreeramakrishnan) బంగారు స్మగ్లింగ్ కేసులో నిందితులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. బంగారు అక్రమ రవాణా కేసులో నిందితుల్లో ఒకరితో సన్నిహిత సంబంధాలు ఉన్నందున స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ ను పదవి నుంచి తొలగించాలని కేరళ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు ఇచ్చామన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ పినరయి విజయన్ సర్కార్‌పై విమర్శలు
అయితే, నిబంధనల ప్రకారం అసెంబ్లీ సమావేశానికి 14 రోజుల ముందు నోటీసు జారీ చేయాలని స్పీకర్ దీనిని తిరస్కరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చను తర్వాత అనుమతించవచ్చు అని వ్యాఖ్యానించారు. ఇక, కోవిడ్ 19 ప్రొటోకాల్‌ను అనుసరించే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు.