Congress leader Ramesh Chennithala and Kerala CM Pinarayi Vijayan. (Photo Credit: ANI/PTI)

Thiruvananthapuram, July 8: కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Kerala Gold Smuggling Case) హాట్ టాపిక్ గా మారింది. బంగారం స్మగ్లింగ్ కేసుకు బాధ్యత వహించి సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) తన పదవికి రాజీనామా చేయాలని కేరళలోని ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) డిమాండ్ చేసింది. కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల (Congress Leader Ramesh Chennithala) బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నత హోదాలో ఉన్న స్వప్న సురేశ్, యూఏఈ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకురావడం వెనుక సీఎంవో కార్యాలయం ప్రమేయం ఉన్నదని ఆయన ఆరోపించారు.

ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్ అనేది స్వప్న సురేష్‌ను ఐటీ విభాగంలో నియమించిన ప్లేస్‌మెంట్ ఏజెన్సీ అని రమేశ్ తెలిపారు. క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న ఆమెను నిఘా వ్యవస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉంచిందని చెప్పారు. ఆ మహిళకు సీఎం విజయన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే నిందను ఆ ప్లేస్‌మెంట్ ఏజెన్సీపైకి నెట్టడానికి కేరళ సీఎం ప్రయత్నిస్తున్నారని రమేశ్ విమర్శించారు. వికాస్ దూబే ప్రధాన అనుచరుడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు, మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్న వికాస్‌ దూబే, 200 మంది పోలీసులపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

సీఎం ప్రధాన కార్యదర్శికి కూడా ఆమెతో సంబంధాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయనను ఆ పదవి నుంచి తప్పించారన్నారు. ఉన్నత హోదాలో జరిగిన బంగారం స్మగ్లింగ్ వ్యహారానికి బాధ్యత వహించి సీఎం విజయన్ రాజీనామా చేయాలని రమేశ్ డిమాండ్ చేశారు.

Here's what Ramesh Chennithala said:

ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో తమ కార్యాలయానికి లింక్ ఉందని వచ్చిన ఆరోపణలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. స్వప్నను ‘వివాదాస్పద మహిళ’ గా పేర్కొన్న ఆయన.. ఆమెకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ జరిగిందన్న విషయం నిజమేనని. కానీ కస్టమ్స్ శాఖ సమర్థంగా ఈ రాకెట్ ని ఛేదించిందని ఆయన చెప్పారు. ఈ రాకెట్ కి, తమ ప్రభుత్వానికి లింక్ ఎలా పెడతారన్నారు.

ఆ మహిళ కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్న ఐటీ కార్యదర్శి ఎం.శివశంకర్ ని తొలగించామని అన్నారు. ‘ఈ కేసులో ఎవరో వ్యక్తి నిందితుల తరఫున కస్టమ్స్ కార్యాలయానికి ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి.. కానీ దీన్ని ఆ కార్యాలయమే తోసిపుచ్చింది’ అని విజయన్ పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ‘డిప్లొమాటిక్ బ్యాగేజీ’ ని మా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ సంస్థకైనా అందజేశారా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంబసీకి సంబంధించినదని, అంతే తప్ప ప్రభుత్వానికి కాదని ఆయన చెప్పారు.

ఐటీ శాఖకు ఆ మహిళ తో డైరెక్ట్ సంబందం లేదు.. ఆ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యాన వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి.. వాటిలో స్పేస్ పార్క్ కూడా ఒకటి.. బహుశా ఆమెకు ఏదో హోదాలో… అది కూడా కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమించి ఉండవచ్చు.. ‘అని విజయన్ పేర్కొన్నారు. ఆమెను ఓ ఏజన్సీ ద్వారా నియమించి ఉండవచ్ఛునన్నారు. స్వప్న సురేష్ గతంలో చేసిన ఉద్యోగాల్లో కేంద్రం తరఫున ఎవరి పలుకుబడో ఉంటుందని భావిస్తున్నామని, నిందితులను కాపాడడానికి తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ యత్నించబోదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం ఎయిర్ పోర్టులో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళ ఐటీ ఉద్యోగిని స్వప్న సురేష్ ను సోమవారం(జూలై 6,2020) కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు స్వప్నను ప్రశ్నిస్తున్నారు.

యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని అయిన స్వప్న సురేష్ పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆమెను ఐటీ శాఖ నుంచి తొలగించారు. ఆమె సీఎంవోలో కీలక ఉద్యోగి కూడా కావడంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ముఖ్యమంత్రికి తెలిసే ఈ తతంగం సాగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

స్వప్న సురేష్ అబుదాబిలో పుట్టి పెరిగింది. స్వప్న తండ్రి స్వస్థలం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని బలరామపురం. స్వప్న తిరువనంతపురంలో రెండేళ్లు పని చేసిన తర్వాత 2013లో ఎయిరిండియా సాట్స్ లో జాబ్ వచ్చింది. 2016లో ఆమె అబుదాబీ తిరిగి వెళ్లిపోయింది. ఎయిరిండియా ఉన్నత ఉద్యోగి సంతకం ఫోర్జరీ కేసుకి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో ఆమె వెళ్లిపోయింది.

దర్యాఫ్తులో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వప్న సురేష్ ను జూన్ లో విచారణకు పిలిచారు. కానీ ఆమె రాలేదు. స్వప్న సురేష్ ను ఇబ్బంది పెట్టొద్దని కేసు విచారణ చేస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. స్వప్న సురేష్ యూఏఈ కాన్సులేట్ లో సెక్రటరీగా పని చేసింది. 2019లో ఆ జాబ్ వదిలేసింది. బాధ్యతారాహిత్యంగా ఉన్న కారణంగా ఆమెను విధుల నుంచి తప్పించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది

యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఈ బంగారం దొరికింది. విచారణ సంధర్భంగా తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను.. చివరికి నిజం కక్కేయడంతో సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన సరిత్ కుమార్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కస్టమ్స్, పోలీస్ అధికారులు స్వప్నను అదుపులోకి తీసుకున్నారు.

గతంలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసిన సమయంలోనే స్వప్న పలు ఆరోపణలు ఎదుర్కొన్న స్వప్న ప్రస్తుతం కేరళ ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక ఐటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు(KSITIL)కు మార్కెటింగ్ అధికారిగా ఉన్నారు. నేరచరిత్ర కలిగిన స్వప్నను ఆ ప్రాజెక్టులోకి తీసుకోవడం వెనుక ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ ప్రోద్బలం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయన్ కు తెలిసే ఆమె నియామకం జరిగిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.