Kheti Bachao Yatra: మీ చట్టాలతో రైతులకు అన్యాయం చేస్తారా? ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, ఖేతీ బచావో యాత్ర పేరుతో 3 రోజుల పాటు పంజాబ్‌లో ర్యాలీలు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ
దీనిపై విపక్షాలు ప్రధాని మోదీ సర్కారుపై విమర్శానాస్త్రాలు సంధించాయి. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీపై (Rahul Gandhi Lashes Out at Narendra Modi Government) విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అంత ఆత్రంగా వ్యవసాయ చట్టాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.
Moga, October 4: గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై విపక్షాలు ప్రధాని మోదీ సర్కారుపై విమర్శానాస్త్రాలు సంధించాయి. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీపై (Rahul Gandhi Lashes Out at Narendra Modi Government) విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అంత ఆత్రంగా వ్యవసాయ చట్టాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వ్యవసాయం చట్టాలపై (Farm Bills) మోదీ ప్రభుత్వం ఎందుకు ఆత్రపడిందని ఆయన మండిపడ్డారు.
ఆదివారం పంజాబ్‌లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఖేతీ బచావో యాత్రలో (Kheti Bachao Yatra) రాహుల్ పాల్గొన్నారు. ఆ ర్యాలీలో మాట్లాడిన రాహుల్ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత‍్వం రైతులకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 'ఖేతీ బచావో యాత్ర' పేరుతో పంజాబ్‌లో మూడు రోజుల పాటు ర్యాలీలు నిర్వహించనున్నారు. రైతులతో వరుస పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ మూడు బిల్లులపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను చాటాలని నిర్ణయించారు.
పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు హాజరై... అనంతరం అక్కడి నుంచి లూదియానా వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), ప్రభుత్వ ఆధ్వర్యంలో హోల్‌సేల్ మార్కెట్లు.. ఇలా రైతులకు ఉపయోగపడే విధానాలను నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నింస్తోందని ఆయన విమర్శించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ (Captain Amarinder Singh) బైఠాయించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయడం గమనార్హం.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ బిల్లుల ద్వారా కార్పొరేటు శక్తులు వ్యవసాయ రంగంలో ప్రవేశించే అవకాశం ఉందని, అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నా... కేంద్ర ప్రభత్వం మాత్రం ఇవి రైతులకు ఉపయోగపడే బిల్లులని అంటున్నారు.
విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం, బిల్లు ముసాయిదా ప్రతులను చించేసిన విపక్ష ఎంపీలు
ప్రధాని నరేంద్రమోదీ రైతుల మేలు కోసమే వ్యవసాయ చట్టాలు చేశామని చెబుతున్నారని, అదే నిజమైతే ఆ చట్టాలపై లోక్‌సభ, రాజ్యసభలో ఎందుకు చర్చించలేదని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చకు ఆస్కారం లేకుండా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకోవాల్సిన ఆత్రం ఏమొచ్చిందని రాహుల్ ఫైరయ్యారు. ప్రభుత్వం చేసిన చట్టాలు సరైనవే అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు ఆందోళనకు దిగుతున్నారని రాహుల్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం చేసిన మూడు నల్లచట్టాలను చెత్తబుట్టలో పడేస్తామని వ్యాఖ్యానించారు.