PM Modi (Photo-ANI)

New Delhi, September 21:  వ్యవసాయ చట్టాలు (MSP And Farm Bills) 21 వ శతాబ్దిలో దేశం ముందుకు సాగడానికి  అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కొత్త‌గా పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశపెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుల ద్వారా రైతులు మ‌రింత బలోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) అన్నారు. బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. నిన్న పార్ల‌మెంట్లో రెండు వ్య‌వ‌సాయ బిల్లులు పాస‌య్యాయ‌ని, ఈ సంద‌ర్భంగా రైతుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన బిల్లులతో విపక్షాల రైతుల ఓటుబ్యాంకు చేజారిపోయే ప్రమాదముందని, అందుకే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలు వివాదాస్పద వ్యాఖ్యలకు నిర్మాతలంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. వ్య‌వ‌సాయ రంగంలో మార్పు అవ‌స‌ర‌మ‌ని, రైతుల కోస‌మే త‌మ ప్ర‌భుత్వం ఈ సంస్క‌ర‌ణ తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాని అన్నారు. కొత్త బిల్లుల‌తో త‌మ పంట‌ను ఎక్క‌డైనా అమ్ముకునే అధికారం రైతుల‌కు ఉంటుంద‌న్నారు.

అయితే ఈ బిల్లులు వ్య‌వ‌సాయ మండీల‌కు వ్య‌తిరేకం కాదు అని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఉన్న‌ట్లుగానే ఇక ముందు కూడా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (Farmers That Minimum Support Price Will Continue as Before) కొన‌సాగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. కొత్త చట్టాలతో చాలా మందికి కొత్త ఇబ్బందులు వచ్చాయి. కొత్త బిల్లుతో మండీలకే ఏం జరుగుతుంది? అవేమైనా మూతపడతాయా? అలాంటిది ఎప్పటికీ జరగదు’’ అని మోదీ స్పష్టం చేశారు. కొత్త చట్టంతో మార్కెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని, అవి కొనసాగుతాయని, గతంలో కంటే మరింత మెరుగ్గా పనిచేస్తాయని ఆయన ప్రకటించారు.

రాజ్యసభలో దుమారం, 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై విపక్షాల అవిశ్మాస తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు

కొత్త చట్టాలతో మార్కెట్‌కు నష్ట వాటిల్లుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా తప్పుడు ప్రచారమని మోదీ స్పష్టం చేశారు. క‌రోనా వైర‌స్ వేళ రికార్డు స్థాయిలో గోధుమ‌లు కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూపంలో సుమారు ల‌క్షా 13వేల కోట్ల ను రైతుల‌కు అంద‌జేశామ‌న్నారు.గ‌త ఏడాది క‌న్నా ఇది 30 శాతం ఎక్కువే అన్నారు.

భారత దేశ గ్రామాలు స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాయని, ఆ అడుగులు బిహార్ నుంచి మొదలు కావడం ఎంతో ముదావహం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బిహార్‌కు చెందిన 294 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులను ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. దీంతో పాటు ‘ఇంటి వరకూ ఫైబర్’ అన్న కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం మాత్రమే మౌలిక సదుపాయాల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిందని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చివరంచు ప్రాంతాలకు కూడా ‘ఫైబర్ ఇంటర్నెట్ సేవలు’ చేరాలన్నదే లక్ష్యమని, ఈ డిజిటల్ విప్లవాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని మోదీ పేర్కొన్నారు.