Sonia Gandhi: కరోనా పేరుతో బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది, వలస కూలీలకు వెంటనే ఆహార భద్రత కల్పించండి, కీలక వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ

కరోనా పేరుతో బీజేపీ (BJP) ద్వేషము, మతతత్వమనే వైరస్‌లను వ్యాపింప చేస్తోందని ఆరోపించారు. కరోనా కల్లోలంతో (Coronavirus Pandemic) దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

File image of Congress chief Sonia Gandhi | (Photo Credits: PTI)

New Delhi, April 23: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో(CWC meeting) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పేరుతో బీజేపీ (BJP) ద్వేషము, మతతత్వమనే వైరస్‌లను వ్యాపింప చేస్తోందని ఆరోపించారు. కరోనా కల్లోలంతో (Coronavirus Pandemic) దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని కాంగ్రెస్‌ (Congress) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్ట్ ఆర్నాబ్‌ గోస్వామిపై దాడి, ఇద్దర్ని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు

లాక్‌డౌన్‌ కారణంగా 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ కుటుంబాలకు 7500 రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం కారణంగా తలెత్తిన తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గురువారం సమావేశమైంది. రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ప్రధాని 3వ సారి భేటీ, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు, దాడులు చేస్తే కఠిన శిక్షలు తప్పవు, ఆర్డినెన్స్ జారీ చేసిన కేంద్ర కేబినెట్

కరోనా కారణంగా రైతులు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దేశవ్యాప్తంగా అతి తక్కువగా కరోనా టెస్టులు జరుపుతున్నారని, పీపీఈ కిట్లు నాసిరకానివి వాడుతున్నారని సోనియా ఆరోపించారు. కరోనా కట్టడికి యత్నిస్తోన్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు అభినందనీయులని సోనియా అన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ టెస్టు కిట్ల కొరత ఉందని పేర్కొన్నారు.

Here's what Sonia Gandhi said:

అదే విధంగా లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యంగా రైతులు, కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో నడి రోడ్లపై నిలబడి ఉన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార భద్రత, ఆర్ధిక పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం, వాణిజ్యం , పారిశ్రామిక రంగాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని.. సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికే లేఖ రాసారు. లాక్‌డౌన్‌ వల్ల్ల ఎవరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రధానిని కోరారు. తక్కువ ధరకు ధాన్యం అందించే కేంద్రం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. అయితే దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాన్ని సెప్టెంబర్‌ వరకూ పొడిగించాలని సూచించారు. అదే విధంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై సమాలోచనలు చేయడం సహా వాటిపై పార్టీ వైఖరిని వెల్లడించేందుకు మాజీ ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ చైర్మన్‌గా ఓ సంప్రదింపుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif