Asia's Richest Man: ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం
Mukesh Ambani (Photo Credits: IANS)

New Delhi, April 23: ఫేస్‌బుక్ , రిలయన్స్ జియో ( Jio, Facebook Deal) మెగా డీల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఫేస్‌బుక్‌తో (Facebook) జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Man) నిలిచాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది. జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్‌, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం

ఈ క్రమంలో బ్లూమింగ్ బిలియనీర్స్ తాజా నివేదిక ప్రకారం.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘అలీబాబా’ అధినేత జాక్ మా (Jack Ma) ను వెనక్కి నెట్టి ముఖేశ్ (mukesh ambani) ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బుధవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లాభం 10 శాతం ముఖేశ్ ఆస్తి 4.7 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 49.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనంవతుల జాబితాలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో ఉండగా.. జాక్ మా 19వ స్థానంలో నిలిచారు.

రిలయన్స్‌ జియోలో 10 శాతం వాటాను ఫేస్‌బుక్‌ రూ.43,574 కోట్లు(570 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనున్నదన్న వార్త రిలయన్స్ తోపాటు పలు రంగాల్లో జోష్ నింపింది. దీంతో బుదవారంనాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు పది శాతానికి పైగా ఎగిసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అపర కుబేరుల జాబితాలో నిలిచిన అంబానీ తాజా పరిణామంతో చైనా బిలియనీర్ అలీబాబా అధినేత జాక్ మాను అధిగమించి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి 5 సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది