Arnab Goswami: జర్నలిస్ట్ ఆర్నాబ్‌ గోస్వామిపై దాడి, ఇద్దర్ని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు
Arnab Goswami, Wife Attacked in Mumbai, Two Arrested (Photo-PTI)

Mumbai, April 23: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఆర్నాబ్‌ గోస్వామి (Republic TV editor-in-chief Arnab Goswami) దంపతులపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. విధులు ముగించుకొని ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ఆర్నాబ్ (Arnab Goswami) వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బైక్‌పై దూసుకొచ్చిన వ్యక్తులు ఆర్నాబ్‌ వాహనం దాడికి యత్నించారు. తనపై దాడికి సంబంధించి ఆర్నాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో ఆర్నాబ్‌ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు.

ఈ ఘటనకు సంబంధించి ఆర్నాబ్‌ వీడియో సందేశాన్ని రిపబ్లిక్‌ టీవీ (Republic TV) ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో.. తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్‌ యూత్‌ నాయకులేనని అర్నాబ్‌ ఆరోపించారు. ఆఫీసు నుంచి తిరిగివస్తున్న తమపై రాత్రి 12.15 గంటలకు దాడి జరిగిందని చెప్పారు. బైక్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు.

Here's ANI Tweet

తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), ఆమె కుటుంబమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తనపై జరిగిన దాడిని వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని.. దీనిపై ఎంత దూరమైనా వెళ్తానని తెలిపారు. తాను, తన టీవీ చానెల్‌ నిజం కోసమే పనిచేస్తుందని అన్నారు.

కాసేపటి క్రితమే దాడితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 504, 341 కింద కేసు నమోదు అయ్యిందన్నారు.

Here's Republic TV tweet

Here's Complaint

ఇదిలా ఉంటే ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు రెండు రోజుల క్రితం అర్నాబ్ గోస్వామి రాజీనామా చేశారు. టీవీ చానెల్‌ లైవ్‌ లో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎడిటర్స్‌ గిల్డ్‌లో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ.. తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై మూకదాడి ఘటనపై తన టీవీలో లైవ్‌ చర్చా కార్యక్రమం నిర్వహిస్తూనే అర్నబ్‌ రాజీనామాను ప్రకటించడం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందడంపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు శేఖర్‌ గుప్తా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘పాల్‌ఘర్‌ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే.. మరో వర్గం వ్యక్తి దాడికి గురయ్యుంటే నసీరుద్దీన్‌ షా, అపర్ణా సేన్‌, అనురాగ్‌ కశ్య్‌ప లాంటి వాళ్లంతా ధ్వజమెత్తేవారని అర్నబ్‌ వ్యాఖ్యానించారు.