UP Budget 2020: రూ.5 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్, అయోధ్యలో ఎయిర్‌పోర్టు కోసం రూ. 500 కోట్లు, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ కన్నా

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో (Yogi Adityanath) సహా ఆయన అసెంబ్లీకి చేరుకున్న ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

Lucknow, Febuary 19: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 5,12,860.72 కోట్ల రూపాయల బడ్జెట్‌ను (UP Budget 2020) రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా (Finance Minister Suresh Khanna) ప్రవేశ పెట్టారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో (Yogi Adityanath) సహా ఆయన అసెంబ్లీకి చేరుకున్న ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాది బడ్జెట్‌తో పోల్చితే ఇది 33,159 కోట్ల రూపాయలు అధికం. కాగా ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నాకు ఇదే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్.

అయోధ్యలో రామాలయం (Ayodhya Ram mandir) నిర్మించనున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి పనులపై యూపీ సర్కారు (UP Govt) దృష్టి పెట్టింది. అయోధ్యలో ఎయిర్ పోర్టు (Aydohya Airport) కోసం రూ.500 కోట్లు, పర్యాటక అభివృద్ధి కోసం రూ.85 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు ఇచ్చింది.

యోగీ ప్రభుత్వం ప్రతీకార నిర్ణయం

ప్రముఖ పుణ్య క్షేత్రం వారణాసి (కాశీ)లో అభివృద్ధి పనులు, ఇతర ఏర్పాట్ల కోసం యోగి సర్కారు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం విస్తరణ, సుందరీకరణకు రూ.200 కోట్లు, వారణాసిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు రూ.180 కోట్లు ఇచ్చింది.

రామజన్మభూమిలో ఎలాంటి సమాధులు లేవు

యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సర్కారు ఏర్పాటైన తర్వాత బడ్జెట్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నారు. యోగి సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నాలుగవది. యూపీకి వచ్చే ఆదాయంలో రాష్ట్ర సొంత ట్యాక్సుల నుంచి రూ.1.66 లక్షల కోట్లు, కేంద్రం నుంచి వచ్చే రాష్ట్రవాటా సొమ్ము రూ.1.52 లక్షల కోట్లు.. రెండూ కలిపి రూ.3.18 లక్షల కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.

బడ్జెట్ హైలైట్స్:

కొత్త పథకాలకు రూ.10,967.87 కోట్లు

సైబర్ క్రైమ్ కు రూ. 3 కోట్లు, యూపీ పోలీసు శాఖకు రూ. 20 కోట్లు

రాష్ట్రీయ పోషన్ అభియాన్‌కు రూ.4వేల కోట్లు

లఖ్‌నవూ, కాన్పూర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు రూ.20,000 కోట్లు

గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.2,000 కోట్లు

ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టమ్‌కు రూ.900 కోట్లు

కాశీ విశ్వనాథ మందిరానికి రూ.200 కోట్లు

ప్రయాగ్‌రాజ్‌లో లా విశ్వవిద్యాలయం, గోరఖ్‌పూర్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం

ముఖ్యమంత్రి జన్ కళ్యాణ్ శిక్షా ప్రోత్సాహన్ యోజనకు రూ.1,200

కాన్పూర్ మెట్రోకు రూ.358 కోట్లు

జల్ జీవన్ మిషన్‌కు రూ.3,000 కోట్లు

సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్‌కు రూ.820 కోట్లు

జెవర్ ఎయిర్‌పోర్టుకు రూ.2,000 కోట్లు

అయోధ్య ఎయిర్‌పోర్టుకు రూ.500 కోట్లు

స్వచ్ఛభారత్ మిషన్ కు రూ. 5,791 కోట్లు