SM Krishna Passes Away: ఎస్ఎం కృష్ణ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక మాజీ సీఎం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన స్వగృహంలో మంగళవారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
Bengaluru, Dec 10: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) (SM Krishna Passes Away) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని (Bengaluru) తన స్వగృహంలో మంగళవారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఎస్‌ఎం కృష్ణ 1932 మే 1న కర్ణాటకలోని మండ్య జిల్లాలోని సోమనహళ్లిలో జన్మించారు. జీవితాంతం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన తన రాజకీయ జీవితం చివర్లో బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు. కాగా, ఆయన రాజకీయ జీవితం 1962లో మద్దూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కర్ణాటక అసెంబ్లీ సభ్యుడిగా మారడంతో ప్రారంభమైంది. బెంగళూరును టెక్ క్యాపిటల్ గా మార్చడంలో ఈయనదే కీలక పాత్ర.
విదేశాంగ మంత్రిగా సేవలు
ఎస్‌ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా సేవలు అందించారు.