Astrology: సెప్టెంబర్ 28 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం సంపదకు జ్ఞానానికి సంతానానికి సౌభాగ్యానికి కారణమైన గ్రహం. ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. దీనివల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభ ఫలితాలు లభిస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
వృషభ రాశి: గురుగ్రహం రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి శుభవార్తలు అందుకుంటారు. మీరు చాలాకాలంగా ప్రారంభించాలనుకునే పని ప్రారంభిస్తారు. దీని వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తాయి. మీ కార్యాలయంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు. కొత్త ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేస్తారు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు.
తులారాశి: ఈ రాశి వారికి గురుగ్రహం రాశి మార్పు కారణంగా వ్యాపార రంగాల్లో పురోగతి పొందుతారు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. అతిధులు ఇంటికొచ్చి శుభవార్తలను తీసుకువస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన వ్యాపారాల నుండి లాభాలు రెట్టింపు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు, కుటుంబ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
Astrology: ఆగస్టు 29 న గురుగ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం
కన్యా రాశి: ఈ రాశి వారికి అపారమైన ధన సంపదలో కలిగి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఎప్పటినుంచో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాన్ని పొందుతారు. ఇది మీకు భవిష్యత్తులో చాలా లాభాలను తీసుకువస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని ద్వారా మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు.పెద్ద కంపెనీలో పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి మెరుగుపడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.