astrology

గురు గ్రహం బలానికి శక్తికి జ్ఞానానికి అనుకూలమైన గ్రహం. ఇది జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యలతో పోరాడడానికి శక్తిని ఇస్తుంది. ఆగస్టు 29 గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఆ మూడు రాశుల  ఏంటో తెలుసుకుందాం.

వృషభ రాశి: గురు గ్రహం మృగశిర నక్షత్రంలోనికి సంచారం కారణంగా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. యువత కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలకు వెళ్తారు నూతనంగా గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Astrology: సింహాచలం నరసింహస్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఎప్పటినుంచో వివాహం కానీ అవివాహతులకు వివాహ యోగం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు నిరుద్యోగులు అయితే ఉద్యోగాలను పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. మీకు భవిష్యత్తులో వ్యాపారపరంగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వివాహ సంబంధాలలో బలపడతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు విద్యార్థులకు విదేశీయానం ఉంటుంది.

మీన రాశి: మీ వ్యాపారాన్ని విస్తరించడానికి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడితే ఆ వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ పెరుగుతుంది దీనివల్ల మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు రుణ బాధల నుండి విముక్తి పొందుతారు. పెద్దల నుండి వచ్చే ఆస్తి మీకు అందుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.