Indian Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..
దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వం నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశ నలుమూలలా ఆగస్టు 15న త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది. భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి.
రాష్ట్రాలకు పలు సూచనలు చేసిన కేంద్ర హోం శాఖ
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం (Happy Independence Day 2020) సందర్భంగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. దేశంలో కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ కార్యక్రమాలను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. సామాజిక దూరం, పారిశుద్ధ్యం పాటించడం, మాస్క్‌లు ధరించడం కొనసాగిస్తూనే వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు 30 అవార్డులు, ఉత్తమ సేవలందించిన పోలీసులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం, వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
ఇటీవల వైరస్ నుంచి కోలుకున్నవారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక ఆహ్వానం పంపి వారిని ప్రోత్సహించాలని సూచించింది. గవర్నర్‌లు నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమం కూడా యథాతథంగా నిర్వహించుకోవచ్చని కేంద్రం తెలిపింది. కానీ.. కచ్చితంగా నిబంధలను పాటించాలని కోరింది. మిలిటరీ బ్యాండ్లు రికార్డ్ చేసిన వీడియోలను పెద్ద తెరలపై ప్లే చేయాలని సూచించింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగం ఉంటుందని.. అయితే.. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులు ఉంటారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అమెరికాలో తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలు
భారత సంతతికి చెందిన అమెరికన్లు తొలిసారి త్రివర్ణ పతాకాన్ని టైమ్స్ స్క్వేర్ వద్ద ఎగరేయనున్నారు. న్యూయార్క్ లో మన జాతీయ జెండా (Independence Day Celebration 2020) ఎగరడం ఇదే తొలిసారి. ట్రై స్టే ఏరియాకు చెందిన ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేట్స్ (ఎఫ్ఐఏ) 2020 ఆగష్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజు టైమ్స్ స్క్వేర్ వద్ద జెండాను ఎగరేసి చారిత్రక ఘట్టాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం
ఈ కార్యక్రమానికి న్యూయార్క్ లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రంధీర్ జైస్వాల్ అతిథిగా రానున్నారు. టైమ్స్ స్క్వేర్ వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ దేశ భక్తి పెరిగేలా చేస్తుంది. ఎఫ్ఐఏ సెలబ్రేట్ చేసుకుంటున్న గోల్డెన్ జూబిలీ ఇయర్ కు ఇదొక బహుమానం’ అని ఆర్గనైజేషన్ చెప్పింది. జెండా ఎగరేయడంతో పాటు పరేడ్ ను కూడా నిర్వహించనున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవం గురించి కొన్ని విషయాలు
1. జాతీయ గీతం ‘జన గణ మన'ను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారని అందరికీ తెలుసు. వాస్తవానికి ఈ గీతాన్ని బ్రిటిష్ కింగ్ ఐదో జార్జ్ గౌరవార్థం ఠాగూర్ రచించారు. 1911లో కింగ్ జార్జ్ భారత్ వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఈ గీతాన్ని ఠాగూర్ సిద్ధం చేశారు. తదనంతర కాలంలో అంటే 1950లో ఇదే జాతీయ గీతం అయింది.
2. జాతీయ గేయం ‘వందేమాతరం'ను బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఛటర్జీ రచించిన ‘ఆనంద్మఠ్' నవలలోని మొదటి రెండు చరణాలను తీసుకుని జాతీయ గేయంగా ప్రకటించారు. జాతీయ గీతంగా వందేమాతరానికి బదులు జన గణ మణను తీసుకున్నారు. ఆర్మీ బ్యాండ్లో వాయించడానికి వందేమాతరం కన్నా జన గణ మణ అయితే సులభంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ భావించారని చెబుతుంటారు.
3. భారత స్వాతంత్య్రోద్యమం 1857లోనే ప్రారంభమైంది. మంగల్ పాండే నాయకత్వంలో తొలి సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు తరవాత బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి తాంత్య తోపె బహదూర్ షా జఫర్ నానా సాహెబ్ పోరాటాలు చేశారు.
4. భారత్ పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. 1947 అక్టోబర్లో జమ్మూ కశ్మీర్ భారత్లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్ పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.
5. విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తూ దేశీయ ఉత్పత్తులకు మద్దతుగా 1900 ప్రారంభంలో బాల్ గంగాధర్ తిలక్‌తో కలసి సర్ రతన్ జంషెడ్ టాటా.. బొంబాయిలో స్వదేశీ కోఆపరేటివ్ స్టోర్స్ కో లిమిటెడ్ను స్థాపించారు. ప్రస్తుతం అది బోంబే స్టోర్గా పరిచయం అయింది.
6. ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దును బ్రిటిష్ న్యాయ కోవిదుడు సిరిల్ జాన్ ర్యాడ్క్లిఫ్ నిర్ణయించారు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే ర్యాడ్క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు. దీనిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు.
7. ఆగస్టు 15న భారత్ దేశంతో పాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.
8. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.
9. మొదటి స్వతంత్ర్య వేడుకలకు రావాలని నెహ్రూ, పటేల్ జాతిపిత మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అయితే అప్పుడు కలకత్తాలో హిందూ ముస్లీంల మధ్య కలహాలు రేగుతున్నాయి. నేను మీ ఆహ్వానాన్ని అందుకోలేను ఆ ఘర్షణలు ఆపడానికి ప్రాణాలైనా ఇస్తానని గాంధీ అన్నారు. అప్పుడు ఆయన బెంగాల్ లోని నోవాఖలీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం
జాతీయ జెండా గురించి కొన్ని విషయాలు
1. భారత జాతీయ జెండాను స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యవసాయదారుడు పింగలి వెంకయ్య రూపొందించారు
2. ఆగస్టు 15, 1947 న బ్రిటన్ నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందకముందే జూలై 22, 1947 న భారత జెండాను స్వీకరించారు
3. మొట్టమొదటి భారతీయ జెండాను 1906 ఆగస్టు 7 న కలకత్తాలోని పార్సీ బాగన్ స్క్వేర్ వద్ద ఎగురవేశారు. ఇది ఆకుపచ్చ, పసుపు మరియు ఎరుపు మూడు సమాంతర చారలను కలిగి ఉంది.
4. కుంకుమ రంగు ధైర్యం మరియు త్యాగాన్ని సూచిస్తుంది, తెలుపు రంగు నిజం, శాంతి మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. జెండా యొక్క ఆకుపచ్చ రంగు శ్రేయస్సును సూచిస్తుంది, అశోక్ చక్రం ధర్మ నియమాలను సూచిస్తుంది (ధర్మం)
5. జాతీయ జెండాలోని మధ్య తెల్లని గీత 24 సమాన అంతరాల లైన్లతో నేవీ బ్లూ కలర్‌లో అశోక చక్ర రూపకల్పనను కలిగి ఉంది
6. భారతదేశం యొక్క జాతీయ పతాకం, చట్టం ప్రకారం, ఖాదీతో తయారు చేయబడాలి, ఇది మహాత్మా గాంధీచే ప్రాచుర్యం పొందిన పత్తి లేదా పట్టు యొక్క చేతితో తయారు చేసిన వస్త్రం అయి ఉండాలి.
7. జెండాను తయారు చేసే హక్కు ఖాదీ అభివృద్ధి మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ చేత ఉంది, వారు దానిని ప్రాంతీయ సమూహాలకు కేటాయిస్తారు.
8. టెన్జింగ్ నార్గే 29 మే 1953 న మొదటిసారి ఎవరెస్ట్ పర్వతంపై భారత జాతీయ జెండాను ఎగురవేశారు.
9. 2002 కి ముందు, భారతదేశపు సాధారణ పౌరులు స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మినహా జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతించబడలేదు. 2002 లో, భారత సుప్రీంకోర్టు జెండా కోడ్‌ను సవరించింది మరియు జెండా కోడ్ ప్రకారం ఎప్పుడైనా జెండాను ఎగురవేయడానికి పౌరులందరికీ హక్కులను ఇచ్చింది.
10. జెండా కోడ్ ప్రకారం, పతాకాన్ని పగటిపూట ఎగురవేయాలి మరియు దాని పైన ఇతర జెండా లేదా ఇతర సంకేత ప్రాతినిధ్యం ఉండకూడదు.