Telugu Language Day 2020: తెలుగు భాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి జన్మదినోత్సవమే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం, మహనీయుని జీవిత విశేషాలు మీకోసం

అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు.

Telugu Language Day 2020 (Photo Credits: File Image)

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా (Telugu Language Day 2020) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని (Kaloji Narayana Rao) తెలంగాణ భాషా దినోత్సవంగా (Telangana Telugu Language Day) జరుపుకుంటున్నారు. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు. ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగులో (Telugu) వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెేంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. వారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం (Andhra Pradesh Telugu Language Day) జరుపుకుంటున్నాము. దేశ భాష లందు తెలుగు లెస్స" అని గొప్ప చక్రవర్తుల చేత సైతం పొగడబడిన మన తెలుగు భాష ప్రపంచం నలుమూలలా ఏదో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సంధర్భంగా మన తెలుగు భాషాభివృద్ధి కై పాటుపడిన మహామహులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు.

మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు 30 అవార్డులు, 

అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది గిడుకు రామమూర్తికి. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్‌ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర – ఇంగ్లిష్‌ కోశాన్ని నిర్మించాడు. కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం

మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్‌ –ఇ– హింద్‌ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు.

గిడుగు రామ్మూర్తి ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని "తెలుగు భాషా దినోత్సవం"గా (Telugu Language Day in India) జరుపుకుంటున్నాము. ఈ రోజు అందరం తెలుగులోనే మాట్లాడుదాము, తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం.



సంబంధిత వార్తలు

Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు

Telangana: సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ అధికారుల సంఘం డిమాండ్, ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని ఆందోళన

Jalaun Horror: యూపీలో దారుణం, మహిళ ప్రైవేట్ భాగాల్లో కర్రను చొప్పిస్తూ సామూహిక అత్యాచారం, తర్వాత కారం పోసి కామాంధులు పైశాచికానందం

Jagan Slams Chandrababu Govt: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం, బురద జల్లుతూ రాతలు రాయడంపై మండిపడిన జగన్, ఇంకా ఏమన్నారంటే..