Platelet Count: రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎలా పెంచుకోవాలి, ప్లేట్‌లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది, ప్లేట్‌లెట్స్ ఎలా గుర్తించాలి, ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకుంటే ప్లేట్‌లెట్‌ కౌంట్ పెంచుకోవచ్చో ఓ సారి చూద్దామా..

మానవ శరీరంలోని రక్తంలో ప్లేట్‌లెట్‌లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్లేట్‌లెట్‌లు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే రక్త కణాలు. కొంతమందికి థ్రోంబోసైటోపెనియా లేదా తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉంటుంది, అంటే వారు తమ స్థాయిలను పెంచే మార్గాలను (Increase Blood Platelets) కనుగొనవలసి ఉంటుంది.

Platelet Count (Photo-PTI)

మానవ శరీరంలోని రక్తంలో ప్లేట్‌లెట్‌లు అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్లేట్‌లెట్‌లు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే రక్త కణాలు. కొంతమందికి థ్రోంబోసైటోపెనియా లేదా తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ ఉంటుంది, అంటే వారు తమ స్థాయిలను పెంచే మార్గాలను (Increase Blood Platelets) కనుగొనవలసి ఉంటుంది. సాధారణంగా తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఇక ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది.ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్.

శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్. సాధారణంగా డెంగీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ఎక్కువ‌గా ప్లేట్‌లెట్స్‌ క్షీణిస్తుంటాయి. ఆసమయంలో ర‌క్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి ప‌డిపోతుంది. దీంతో ఆరోగ్యం మ‌రింత విషమించి ప్రాణాలుకూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. అలాంటి జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటుగా కొన్నిరకాల పండ్లు, ఇతర ఆహార ప‌దార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను (How to Increase Platelet Count Naturally) పెంచుకోవ‌చ్చు.

షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా, మధుమేహం వచ్చే ముందు కలిగే లక్షణాలు గురించి తెలుసుకోండి, చక్కెర వ్యాధికి గల కారణాలు, మానుకోవలసిన అలవాట్లు, జాగ్రత్తలు ఓ సారి చూద్దామా..

శరీరంలో ప్లేట్‌లెట్స్ ఎందుకు తగ్గుతాయి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య, నాణ్యత తగ్గిపోతున్నాయి. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు. ప్లేట్ లెట్లు సాధారణంగానే ఉన్నా అవి నాణ్యంగా లేకపోతే రక్తస్రావం ఆగదు.

గంజిని మీరు ఎప్పుడైనా తాగారా, Ganjiలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా, Rice Water మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దామా..

ప్లేట్‌లెట్స్ ఎలా గుర్తించాలి?

సాధారణంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పది వేలకు తగ్గే వరకు ఏ లక్షణాలు కనిపించవు. ఒకవేళ అంతకన్నా తక్కువగా పడిపోతే మాత్రం శరీరంలోని వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం మొదలవుతుంది. నోటి లోపలి పొర, చిగుళ్లు, ముక్కు లోపలి పొరల్లోంచి రక్తస్రావం ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు. ముఖ్యంగా డెంగ్యూ వస్తే తీవ్ర జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే కూడా ప్లేట్‌లెట్స్ తగ్గినట్లు గుర్తించాలి.

నపుంసకత్వాన్ని దూరం చేసి లైంగిక సామర్థాన్ని పెంచే ఔషదం వెల్లుల్లి, రోజూ పచ్చి తెల్లగడ్డ రెబ్బలు కొన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

ప్లేట్‌లెట్స్ ఎవరికి ఎక్కించాలి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ ఏమాత్రం తగ్గినా వెంటనే ప్లేట్ లెట్స్ ఎక్కించాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది సరికాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్లేట్‌లెట్లు పది వేలకు తగ్గితేగానీ ఎక్కించకూడదు. ఒకవేళ పది వేల కన్నా ఎక్కువగా ఉండి రక్తస్రావం అవుతుంటే మాత్రం ప్లేట్‌లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. శరీరానికి సహజంగానే తగ్గిపోయిన ప్లేట్ లెట్స్ కణాలను తిరిగి ఉత్పత్తి చేసుకునే శక్తి ఉంటుంది. అందుకే అత్యవసర సమయాల్లో మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాలి.

వీర్య కణాలు పెరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్పెర్మ్ కౌంట్ పెరుగుదలకు..స్పెర్మ్ నాణ్యతకు తీసుకోవాల్సిన ఆహార పదార్డాల లిస్ట్ ఏమిటో ఓ సారి తెలుసుకోండి

ప్లేట్‌లెట్స్ నిర్ధారణ తప్పనిసరి

శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనే అంశంపై సరైన వ్యాధి నిర్దారణ జరిగితే చికిత్స సులువవుతుంది. డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య చాలా వేగంగా పడిపోతు ఉంటుంది.. వీరికి డెంగ్యు చికిత్సతో పాటు అవసరాన్ని బట్టి ప్లేట్ లెట్స్ ఎక్కించవలసి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్లేట్ లేట్ల సంఖ్య పడిపోతే వారం పదిరోజుల్లో నియంత్రణలోకి వస్తాయి. మలేరియా కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతే అదేచికిత్స అందించాలి. ఏవైనా మందుల కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోతూ ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో వాటిని మానేయాలి.

ఒక్క ఉల్లిపాయతో అద్భుతమైన ఆరోగ్యం, ఉల్లిగడ్డ ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, శరీరరంలో ప్రతి అవయువాన్ని శుద్ధి చేసే ఉల్లిపాయ ప్రయోజనాలు ఏంటో చూద్దామా..

చికిత్సా విధానాలు

గతంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గితే ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉండేది. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అత్యాధునిక విధానాలతో చికిత్స అందిస్తూ ప్రాణాపాయం నుంచి రక్షించగలుగుతున్నారు. రక్తంలో ప్లేట్ లెట్స్ తగ్గితే దాత నుంచి లేదా సేకరించిన రక్తం నుంచి కేవలం ప్లేట్‌లెట్స్‌ను మాత్రమే వేరుచేసి ఎక్కించే అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఎస్‌డిపి), రాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ (ఆర్‌డిపి) పద్ధతులలో రక్తం నుంచి ప్లేట్‌లెట్స్ ను వేరుచేసి అవసరమైన వారికి ఎక్కిస్తున్నారు. ఎస్‌డిపి విధానంలో దాత నుంచి నేరుగా ప్లేట్‌లెట్స్‌ను సేకరిస్తారు. ఆర్‌డిపి విధానంలో సేకరించిన రక్తం నుంచి ప్లేట్ లెట్స్‌ను వేరుచేస్తారు. అయితే ఎస్‌డిపి విధానంలో ఒకసారి 50-60 వేల వరకు ప్లేట్‌లెట్స్ ను సేకరించే అవకాశం ఉంటుంది.

మరో ప్రమాదం..కరోనా పేషెంట్లలో కుళ్లిపోతున్న ఎముకలు,పేషెంట్లు కోలుకున్న 60 రోజుల తర్వాత వారిపై ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి దాడి, ఇప్పటికే ముంబైలో మూడు బోన్‌ డెత్‌ కేసులు నమోదు

ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుకునే ఆహార పదార్థాలు

-ఎండు ద్రాక్ష‌ల్లో 30 శాతం ఐర‌న్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

-ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. ర‌క్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

-ఎండు ఖ‌ర్జూరం, కివీ పండ్ల‌ను తింటున్నాప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి త‌గ్గుముఖం ప‌డుతుంది.

-బొప్పాయి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డెంగీ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకుంటారు. అంతేకాదు బొప్పాయి ఆకు రసం తీసుకున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.

-దానిమ్మ పండ్ల‌ను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

-ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తినాలి. దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

-వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.

-ర‌క్త‌హీన‌త‌తో బాధ‌పడేవారే కాదు, డెంగీ వ‌చ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు. దీంతో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

-క్యారెట్‌ను త‌ర‌చూ తింటున్నా ర‌క్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now