గంజి తాగి బతికేవారు అని సామెత మీరు వినే ఉంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది గంజి తాగడం మానేశారు. టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో అన్నం వండేస్తున్నారు. దీంతో గంజి వాడకం చాలావరకు పూర్తిగా తగ్గిపోయింది. అయితే గ్రామాల్లో ఇంకా చాలా చోట్ల ఈ గంజి వాడకం ఉంది. గంజిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా (Ganji Or Rice Water Benefits) చాలా రకాల అనారోగ్య సమస్యల నుండి దూరం కావొచ్చని (Incredible Health Benefits Of Ganji) వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఇళ్లల్లో గంజి వార్చి అన్నం (Rice water benefits) వండేవారు. గంజిని ఒంపేశాక దాన్ని పల్లెటూళ్లలో చాలా మంది ఉదయం భోజనంతో పాటే తినేవారు. ఇప్పటికీ చాలా మంది గంజిని ఆహారంగా ఉపయోగిస్తారు. మజ్జిగ దొరకని వాళ్లు వేసవిలో చలువదనం కోసం గంజిని అన్నంతో కలిపి (Benefits of drinking rice water) తీసుకుంటారు. గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చని చాలామందికి తెలియదు.
గంజిని ప్రతిరోజు క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను నివారించుకోవచ్చు. గంజిలో బోలెడన్ని విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కడుపులో మంట రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని అధిక వేడి నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల కేన్సర్ల నుండి కాపాడుతుంది. గంజి అనేక పోషకాలను, యాంటీ ఆక్సిడెంట్లను, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంది. పలు శారీరక సమస్యలకు గంజి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి కావలసిన శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే సరి.గంజిలో ఉండే ఆమినో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది శరీరానికి శక్తిని అందించి కండరాలను దృఢంగా చేస్తుంది. ప్రతిరోజు క్రమంతప్పకుండా గంజి తీసుకుంటే శరీరం బలంగా తయారవుతుంది. శరీరం అలసిపోకుండా శక్తిని అందిస్తుంది.కండలు పెరగడానికి శరీరంలోని అమైనో ఆమ్లాలు సహాయపడతాయి. గంజిలో ఇవి పుష్కలంగా ఉంటాయి. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మరింత శక్తినిస్తాయి.
గంజి మన శరీర చర్మ సౌందర్యాన్ని పెంచే అధ్బుతమైన లక్షణాలను కలిగి ఉంది. గంజిలో ఒక కాటన్ బాల్ ముంచి చర్మానికి అప్లై చేయడం ద్వారా మెుటిమలు మరియు మెుటిమలు వలన ఏర్పడిన నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. ముఖానికి గంజి అప్లై చేయడం వలన వయస్సు పైబడటం వలన వచ్చే ముడతలు చాలావరకూ నివారించుకోవచ్చు. గంజిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనవంతమైన చర్మాన్ని ఇస్తుంది.
గంజిని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం ద్వారా వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలోపేతమై ఆరోగ్యవంతమైన మరియు ఒత్తైన జుట్టును పొందవచ్చు. ఒకప్పుడు గంజిని షాంపుగా, హెయిర్ కండీషనర్‌గా వాడేవారు. గంజిని ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. లావెండర్ ఆయిల్‌ని కొద్దిగా గంజిలో కలిపి జుట్టుకు పట్టించి పది నిమిషాలు ఆగాక కడిగేస్తే.. హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడటంతోపాటు చక్కటి సువాసన వస్తుంది. గంజిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.గంజి శరీరాన్ని, మనసు ప్రశాంతంగా ఉంచుతుంది.
స్నానం చేసే ముందు నీటిలో కాసింత గంజిని కలిపి.. దాంతో స్నానం చేస్తే సరి. మీరు మరింత ఉత్సాహంగా మారతారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు శరీరం పోషకాలను కోల్పోతుంది. అలాంటప్పుడు గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. డయేరియాను తగ్గించడమే కాదు ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గంజి ఎంతగానో ఉపకరిస్తుంది. డయేరియా బాధిస్తుంటే.. తరచుగా గంజి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పడుతుంది.