Onion Benefits: ఒక్క ఉల్లిపాయతో అద్భుతమైన ఆరోగ్యం, ఉల్లిగడ్డ ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, శరీరరంలో ప్రతి అవయువాన్ని శుద్ధి చేసే ఉల్లిపాయ ప్రయోజనాలు ఏంటో చూద్దామా..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే (Onion benefits) ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది.అలాగూ ఏ రకమైన డయాబెటిస్ (Onion benefits in diabetes) అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట.
పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ (Onions for type 2 diabetes) అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. అంతే కాదు, ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఉల్లిగడ్డలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను క్రమబద్దీ కరిస్తుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉల్లిగడ్డ ను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిగడ్డను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ కు కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బిపి, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు.
మీరు రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవి కాలంలో మీకు వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువ. దీనితో పాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుండి మిమ్మల్ని రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్త శుద్ధిగా పరిగణిస్తారు మరియు ఇది రక్తాన్ని క్లియర్ చేస్తుంది మరియు శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉన్న భాస్వరం ఆమ్లం రక్తాన్ని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఈ కారణంగా, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా, మీ రక్తం స్పష్టంగా ఉంటుంది మరియు ముఖం మీద దిమ్మలు, మొటిమలు మొదలైన వాటి సమస్య ఉండదు. పచ్చి ఉల్లిపాయలు నిద్రలేమిని దూరం చేస్తాయి.
జలుబు మరియు కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుందని అంటారు. పచ్చి ఉల్లిపాయ రసం త్రాగాలి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు ఈ కారణంగా ముడి ఉల్లిపాయను ఆహారంలో చేర్చాలి. ముడి ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్ల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇది మీకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి.
ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లి గడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే వైద్య, ఆరోగ్య సంస్థలు ఔషదాల తయారీలో వీటిని వాడుతున్నాయి. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతాయి.
బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు కాపాడతాయి. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టు కుచ్చులా మెరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ పెంచడం వల్ల జుట్టు పెరుగుతుంది.
మధుమేహంతో బాధపడే వారు పచ్చి ఉల్లిపాయలను తినం ఎంతో మంచిది. ఉల్లి గడ్డ ఇన్సూలిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రణ ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి, గుండె జబ్బులను దూరం చేయడానికి ఉల్లి మంచి ఔషదం. రక్త నాళాల్లో రక్తం గడ్డకడితే గుండె పోటు ఇతరాత్ర సమస్యలు రావచ్చు. అయితే, ఉల్లి శరీరంలోని రక్తం పల్చగా ఉంచి కణాలు స్వేచ్ఛగా ప్రవహించేందుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బులు, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది.
ఉల్లి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచుతాయి. తెల్ల ఉల్లిని పేస్టులా చేసుకుని వెన్నతో కలిపి వేయించండి. తర్వాత కాస్త తేనె కలిపి ఖాళీ కడుపున తాగిగే వయాగ్రాలా పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తీసుకున్నా లైంగిక శక్తి పెరుగుతుంది. రోజుకు మూడుసార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఉల్లి సెక్స్ కోరికలను పెంచడానికే కాదు.. జననేంద్రియాలు సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. అందుకే మన మన పెద్దలు ఉదయన్నే పెరుగు, ఉల్లిగడ్డను ఆహారంగా తీసుకొనేవారు. ఉల్లిపాయలు వేసి తయారు చేసే కర్డ్‌బాత్ కూడా ఆరోగ్యానికి మంచిదే. విసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పి ఏర్పడుతున్నట్లయితే ఉల్లిని తీసుకోండి. కొన్ని ఉల్లి గడ్డలను నీటిలో వేసి బాగా మరిగించి తాగండి. అయితే, 6-7గ్రాములకు మించిన ఉల్లి నీటిని తాగకండి.
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోండి. ఆలివ్ ఆయిల్, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. కాలిన చిన్న చిన్న గాయలను నివారించడానికి కూడా ఉల్లి గడ్డలు ఉపయోగపడతాయి. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని రాసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. కాలిన చోటు బొబ్బలు రాకుండా నిరోధిస్తుంది. అలాగే, కాలిన చోట బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఏర్పడే నొప్పిని నివారించేందుకు కాస్త ఉల్లి రసాన్ని రాయండి.
ఉల్లి గడ్డల్లోని సల్ఫర్ సమ్మేళనాలు ఆస్త్మాకు కారణమయ్యే బయో కెమికల్ చెయిన్ ఫార్మేషన్‌ను నిలిపివేస్తుందని పరిశోధనల్లో తేలింది. దగ్గుతో బాధపడేవారు నోరు ఆరిపోకుండా ఉండేందుకు ఉల్లిని తీసుకోవడం ఉత్తమం. జాండీస్, కామెర్ల నివారణకు కూడా ఉల్లి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. తర్వాతి రోజు ఉదయం చిటికెడు ఉప్పు వేసుకుని తాగినట్లయితే సమస్య దూరమవుతుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)