Heavy Crowd at Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రం.. దర్శనానికి 18 గంటల సమయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు
రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకూ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Tirumala, June 30: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు (Tirumala) భక్తులు (Devotees) పెద్దయెత్తున పోటెత్తారు. రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకూ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుద్ధమైన ఆహారాన్ని తక్కువ ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జే శ్యామలరావు పేర్కొన్నారు.
హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు
శనివారం రోజున 80,404 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో