Paap Mukti Certificate: ఈ గుడిలోని కోనేరులో స్నానం చేస్తే.. పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్.. ఏమిటా సంగతి?
ఈ నేపథ్యంలో తమ పాపాలను తొలగించుకునేందుకు ఈ ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు.
Newdelhi, Nov 3: ఒక గుడిలోని (Temple) కోనేరులో పవిత్ర స్నానం ఆచరించిన వారు పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్ ఇస్తున్నారు. (Paap Mukti Certificate) ఈ నేపథ్యంలో తమ పాపాలను తొలగించుకునేందుకు ఈ ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. రాజస్థాన్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజధాని జైపూర్ కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలో గోతమేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉంది. ఆలయంలోని మందాకినీ కోనేరులో పవిత్ర స్నానం చేసిన వారు పాపం నుంచి విముక్తి పొందినట్లు అధికారికంగా ధృవీకరిస్తారు. రూ.12 చెల్లిస్తే ప్రభుత్వ దేవస్థాన శాఖ పరిధిలోని ఆలయ ట్రస్ట్ ద్వారా సర్టిఫికేట్ ఇస్తారు. అయితే ప్రతి ఏటా పరిమిత సంఖ్యలో సుమారు 250 నుంచి 300 సర్టిఫికేట్లు మాత్రమే జారీ చేస్తారు.
పురాణగాథ ఇది
గౌతమ మహర్షి ఈ ఆలయ కోనేరులో స్నానం చేసిన తర్వాత ఆవును చంపిన పాపం నుంచి విముక్తి పొందినట్లు భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో వ్యవసాయం సందర్భంగా పురుగులు, కీటకాలతోపాటు అనుకోకుండా జంతువులను చంపిన వారు లేదా కులం, సంఘం నుంచి బహిష్కరణకు గురైన వారు ఆలయ కోనేరులో పవిత్ర స్నానం చేస్తే ఆ పాపాల నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్ జారీ చేస్తారని గ్రామ పెద్దలు తెలిపారు. తద్వారా కులం లేదా సంఘం బహిష్కరణ నుంచి వారికి విముక్తి లభిస్తుందని చెప్పారు.
Dalit Woman Raped: దళిత మహిళను రేప్ చేసి.. మూడు ముక్కలుగా నరికి చంపిన దుండగులు.. యూపీలో ఘోరం