Tirumala: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ కోటా విడుదల, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి, తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల (December Quota Released by TTD) చేసింది.

Tirumala (File Image)

Tirumala, Nov 11: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ( Special Entry Darshan Tickets) టీటీడీ విడుదల చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల (December Quota Released by TTD) చేసింది. డిసెంబర్‌ మాసం మొత్తానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచనున్నది.

కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. కాగా, వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబర్‌ నెల కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని అధికారులు తెలిపారు.తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

గురువారం శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 30,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

టికెట్ ఎలా బుక్‌ చేయాలో చేసుకోండి..

రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌(https://tirupatibalaji.ap.gov.in/#/login) లోకి వెళ్లాలి. తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ముందుగానే రిజిస్టర్‌ చేసుకున్నవారైతే లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత లేటెస్ట్‌ అప్‌డేట్‌లో ఉండే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్‌ చేయాలి. అనంతకు మనకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలక్ట్‌ చేసుకొని డబ్బు చెల్లించాలి.