Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు

ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

Credits: TTD

Tirumala, Oct 22: తిరుమల (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి (Sridevi), భూదేవి (Bhudevi) సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పురవీధుల్లోకి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కర్పూరహారతులతో దర్శించుకుంటున్నారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడి వాహనసేవ కనులవిందుగా జరుగుతోంది.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ 

ఆదివారం రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీనివాసుడు దర్శనమివ్వనున్నాడు. అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. కాగా నేటితో శ్రీవారి వాహన సేవలు ముగుస్తాయి. సోమవారం ఉదయం నిర్వహించనున్న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

KTR Comments: రేపో..ఎల్లుండో ఇంట్రస్టింగ్ వార్త వింటారు! మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుస్తారు, ఈ సారి బీజేపీకి డిపాజిట్లు రావంటూ కామెంట్స్