Uttar Pradesh Viral Video: ఆంటీ అని పిలిచినందుకు వీరబాదుడు బాదింది, ఉత్తరప్రదేశ్‌లో 40 ఏళ్ల మహిళ 19 ఏళ్ల యువతిని చితక్కొడుతున్న వీడియో బయటకు, సోషల్ మీడియాలో వైరల్
చిన్నవాళ్లయితే పెద్దవాళ్లను అంకుల్, ఆంటీ, అన్నా, అక్కా ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇలా పిలిచినందుకు ఓ యువతిని పట్టుకుని చావబాదింది 40 ఏళ్ల మహిళ
చిన్నవాళ్లు పెద్దవాళ్లను వరసలతో పిలవడం సాధారణంగా జరిగే విషయం తెలియని వాళ్లని కూడా ఎక్కడైనా వారి పేర్లు తెలియవు కాబట్టి ఏదో వరస పెట్టి పిలుస్తుంటాం. చిన్నవాళ్లయితే పెద్దవాళ్లను అంకుల్, ఆంటీ, అన్నా, అక్కా ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఇలా పిలిచినందుకు ఓ యువతిని పట్టుకుని చావబాదింది 40 ఏళ్ల మహిళ.. ఘటన వివరాల్లోకెళితే.. యూపీలోని ఈటాలో బాబూగంజ్ మార్కెట్‌లో కొందరు మహిళలు షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి అక్కడే ఉన్న ఓ మహిళను ఆంటీ అని పిలిచింది. దీంతో ఆమెకు కోపం నషాళానికి అంటింది.
'నన్నే ఆంటీ అంటావా?' అంటూ పళ్లు కొరుకుతూ అమ్మాయి జుట్టు పట్టుకుని మరీ చితకబాదింది. ఆమె అలా వీరబాదుడు బాదుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మరికొందరు మహిళలు ఆమెకు సాయం చేయడం గమనార్హం. ఇంతలో ఓ మహిళా పోలీసు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ ఘర్షణపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇక ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆంటీ అంటే మీదపడి కొట్టేస్తారా? అని నోరెళ్లబెడుతున్నారు
Here's Viral Video
కాబట్టి అమ్మాయిలు ఎక్కడైనా అపరిచిత మహిళలను ఆంటీ అని పిలిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొరపాటున ఆంటీ అని పిలిచినప్పుడు వాళ్లకు తిక్క లేస్తే మిమ్మల్ని ఉతికినా ఉతికేస్తారు.