383 Years Jail Punishment: ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాల కేసు.. నకిలీ పత్రాలతో 47 బస్సుల విక్రయం.. మూడు దశాబ్దాల తర్వాత తీర్పు.. నిందితుడికి 383 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోయంబత్తూర్ కోర్టు

దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.

Coimbatore, July 30: నకిలీ పత్రాలను (Fake Papers) సృష్టించి, మోసానికి పాల్పడిన వ్యక్తికి తమిళనాడులని (Tamilnadu) కోయంబత్తూర్ కోర్టు (Coimbatore Court) 383 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ. 3.32 కోట్ల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.  కేసు వివరాల్లోకి వెళ్తే... ఇది 1988 నాటి కేసు. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్ లో బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయంటూ 1988 నవంబర్ 9న ఫిర్యాదు నమోదయింది. నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Twitter Revenue: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్.. రెవెన్యూ షేరింగ్ కు విధివిధానాలు ఇవిగో!

మూడు దశాబ్దాలుగా విచారణ

అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలోనే నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు. మరోవైపు, బతికున్న వారిలో కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురునీ జడ్జి నిర్దోషులుగా పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మూడు శిక్షలను కలిపితే మొత్తం 383 సంవత్సరాల శిక్ష అవుతుంది. ప్రస్తుతం కోదండపాణి వయసు 82 సంవత్సరాలు. దీంతో, ఏడేళ్ల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని జడ్జి తీర్పును వెలువరించారు.

ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం