Hyderabad, July 30: ప్రముఖ వీడియో పోస్టింగ్ ప్లాట్ ఫాం (Video Posting Platform).. యూట్యూబ్ లో (Youtube) వీడియోలు (Videos) పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ (Twitter) లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు. ఈ యాడ్ రెవెన్యూ విధానం ఎలా ఉంటుందంటే... వెరిఫైడ్ యూజర్లు ట్విట్టర్ లో చేసే పోస్టులకు వచ్చే రిప్లయ్స్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలను ప్రదర్శిస్తారు. ఇలాంటి పోస్టులకు వచ్చే ఇంప్రెషన్స్ సంఖ్య ఆధారంగా యూజర్లు ఆదాయం ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ట్విట్టర్ నూతన యాజమాన్యం తెరపైకి తెచ్చింది.
విధి విధానాలు ఇలా..
- రెవెన్యూ యాడ్ షేరింగ్ విధానం ద్వారా ఆదాయం పొందాలనుకునేవారు తప్పనిసరిగా ట్విట్టర్ బ్లూ టిక్, లేదా ఇతర వెరిఫైడ్ యూజర్లు అయ్యుండాలి.
- గడచిన 3 నెలల వ్యవధిలో తమ పోస్టులకు కనీసం 15 మిలియన్ల ఇంప్రెషన్లు పొంది ఉండాలి.
- యూజర్ కు కనీసం 500 మంది ఫాలోవర్లు ఉండాలి.
- పేమెంట్లు పొందాలంటే స్ట్రైప్ తప్పనిసరి
- యూజర్లు స్ర్రైప్ ప్లాట్ ఫాంలో ఓ ఖాతా కలిగి ఉండాలి.
- యూజర్లు తమ అకౌంట్ లో కనీసం 50 డాలర్లు ఉంచుకోవాలి.