Hyderabad, July 30: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ (ISRO PSLV C56 Launch) ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 90వ స్పేస్ మిషన్ (Space Mission) కావడం గమనార్హం. ఈ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీని ప్రయోగించారు. షార్ లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగాన్ని చేపట్టారు. పీఎస్ఎల్వీ వాహక నౌకకు సంబంధించి ఈ ఏడాది ఇది రెండో ప్రయోగం కాగా... మొత్తం మీద పీఎస్ఎల్వీ సిరీస్ లో 58వ మిషన్ కావడం గమనార్హం.
Brahmanandam Meets CM KCR: సీఎం కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం దంపతులు
PSLV-C56 Launch Video: ISRO Successfully Launches PSLV-C56 Rocket With Six Co-Passenger Satellites From Sriharikota, Says 'The Mission Is Successfully Accomplished'@isro#PSLVC56Launch #ISRO #IndianRocket #CoPassengerSatellites #Sriharikotahttps://t.co/pDPAwVqIcq
— LatestLY (@latestly) July 30, 2023
సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం
ప్రయోగం విజయవంతమయిన తర్వాత శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయోగం విజయవంతం అయిందని, రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించామని చెప్పారు. సెప్టెంబర్ లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అది కూడా పూర్తిగా కమర్షియల్ మిషన్ అని చెప్పారు.