Newdelhi, Feb 17: స్మార్ట్ ఫోన్ (Smart Phone) వ్యసనంలా మారింది. దీన్ని రుజువు చేస్తూ దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ (Check) చేస్తున్నట్టు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. మేల్కొని ఉన్నపుడు 31 శాతం సమయాన్ని స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతారని, రోజుకు సగటున 80 సార్లు తమ ఫోన్లను చెక్ చేస్తారని తెలిపింది. కంటెంట్ ను స్ట్రీమింగ్ చేయడానికి దాదాపు 50 శాతం సమయాన్ని వెచ్చిస్తారని చెప్పింది.
84% of Indian smartphone users check mobile within 15 mins of waking up: Report https://t.co/386NSWCzNy
— IndiaToday (@IndiaToday) February 16, 2024
డబుల్ కంటే ఎక్కువ
స్మార్ట్ ఫోన్లతో గడిపే సమయం 14 ఏండ్ల వ్యవధిలో డబుల్ అయినట్టు నివేదిక వెల్లడించింది. 2010లో దాదాపు రోజుకు రెండు గంటలపాటు స్మార్ట్ ఫోన్లతో మనుషులు గడిపేవారని.. అయితే, ఇప్పుడు ఇది 4.9 గంటలకు పెరిగిందని తెలిపింది.