Hyderabad, Nov 17: సైబర్ దాడులు (Cyber Attacks) పెరుగుతున్నప్పటికీ యూజర్లు (Users) ఇప్పటికీ బలహీన పాస్ వర్డ్ (Passwords) లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్ వర్డ్ ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్ గా ఉపయోగిస్తున్నట్టు పాస్ వర్డ్ మేనేజ్ మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్ పాస్’ తాజా నివేదికలో పేర్కొంది. తమ లొకేషన్ ను తెలిపే పాస్ వర్డ్ లను కూడా యూజర్లు ఉపయోగిస్తున్నారు.ఈ జాబితాలో ‘ఇండియా@123’ అనేది జాబితాలో అన్నింటికంటే పైన ఉంది. అలాగే, ‘అడ్మిన్’ అన్న పాస్ వర్డ్ ను కూడా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ‘పాస్@123’, ‘పాస్ వర్డ్@123’ అన్నవి కూడా చాలా కామన్ గా కనిపిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
NordPass has revealed its study of the 200 most common passwords in 2023. Is yours on the list? https://t.co/PwSMltOD4x
— NBC Bay Area (@nbcbayarea) November 16, 2023
సెకను లోపే తెలుసుకోవచ్చు
ప్రపంచంలోని పాపులర్ పాస్ వర్డ్ లలో మూడోవంతు (31శాతం) ‘123456789’, ‘12345’, ‘00000’ వంటి పూర్తి నంబర్లు కలిగినవేనని తెలిపింది. నివేదిక ప్రకారం ప్రపంచంలోని 70 శాతం పాస్ వర్డ్ లను సెకనులోపే తెలుసుకోవచ్చు.