cheetah (Credits: twitter)

Newdelhi, April 24: దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) కునో నేషనల్ పార్కుకు (Kuno National Park) తీసుకొచ్చిన చీతాల్లో మరొకటి ప్రాణాలు కోల్పోయింది. చీతాలు చనిపోవడం నెల రోజుల్లో ఇది రెండోసారి. చికిత్స పొందుతూ మగ చీతా ఉదయ్ నిన్న మరణించినట్టు ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ తెలిపారు. అనారోగ్యం పాలవడంతో చికిత్స అందిస్తుండగా చనిపోయినట్టు చెప్పారు. మరణానికి గల కారణం తెలియాల్సి ఉందన్నారు. ‘ఉదయ్’ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆదివారం ఉదయం అటవీ బృందం గుర్తించింది. ఆ తర్వాత దానిని చికిత్స కోసం మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందింది. పశువైద్య బృందం దానికి పోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారు.

Virupaksha Theatre Attacked: సినిమా ఆలస్యం అయ్యిందని.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.. ఎక్కడంటే??

ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌ కు తీసుకొచ్చారు. అందులో ఉదయ్ ఒకటి. గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు మరో చీతా మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు చీతాలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడున్న చీతాల సంఖ్య 18కి పడిపోయింది.

Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స



సంబంధిత వార్తలు

ICC ODI World Cup 2027: రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ వేదిక‌లు రెడీ, సౌతాఫ్రికాలో 8 స్టేడియాల‌ను ఓకే చేసిన ఐసీసీ

Madhya Pradesh: కునో నేషనల్ పార్కులో ఐదు చీతాలకు జన్మనిచ్చిన గామిని, మొత్తం 26కు చేరిన చీతాల సంఖ్య (ఫోటోలు, వీడియో ఇదుగోండి)

Uday Saharan: ట్రోఫీ అంతా రాణించాడు, ఫైన‌ల్ లో మాత్రం చ‌తికిలా ప‌డ్డాడు! తుదిపోరులో చేతులెత్తేసిన కెప్టెన్ల స‌ర‌స‌న చేరిన అండ‌ర్-19 కెప్టెన్ ఉద‌య్ స‌హ‌ర‌న్

India vs South Africa, Under 19 World Cup Semi-final 2024: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ టీమిండియా జట్టు..

RP Patnaik on Uday Kiran: ఉదయ్ కిరణ్ శవాల గదిలో అలా పడి ఉన్న దృశ్యం చూసి తట్టుకోలేకపోయా, ఓ ఛానల్ ఇంటర్యూలో ఒక్కసారిగా ఎమోషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

IND vs SA 2nd Test 2023: రెండో టెస్టులో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసిన రోహిత్ సేన, చెలరేగిన భారత బౌలర్లు

Virat Kohli World Record: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేని రికార్డును సాధించిన విరాట్ కోహ్లీ, ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్

IND vs SA 3rd ODI: వన్డే సిరీస్ గెల్చిన టీమిండియా...సౌతాఫ్రికా మీద 2-1తేడాతో వన్డే సిరీస్ కైవసం, సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'